Vaarasudu: ‘ఇట్స్ ఫర్ యు అమ్మా - ది సోల్ ఆఫ్ వారసుడు’

ABN , First Publish Date - 2022-12-20T18:09:41+05:30 IST

దళపతి విజయ్ (Thalapathy Vijay), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వారసుడు..

Vaarasudu: ‘ఇట్స్ ఫర్ యు అమ్మా - ది సోల్ ఆఫ్ వారసుడు’
Tamil Star Hero Vijay

దళపతి విజయ్ (Thalapathy Vijay), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వారసుడు/వారిసు (Vaarasudu/Varisu).. తెలుగు, తమిళంలో సంక్రాంతికి విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. చార్ట్‌బస్టర్ నంబర్ ‘రంజితమే’ ఇప్పటివరకు 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. రెండవ పాట ‘థీ దళపతి’ కూడా మ్యూజికల్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. తాజాగా ‘ఇట్స్ ఫర్ యూ అమ్మ’ (Its For You Amma) అనే మూడో సింగిల్‌ని చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ పాట వారసుడు సోల్ (The Soul Of Vaarasudu), కథకు కీలకమైన అమ్మ సెంటిమెంట్‌ను తెలియజేస్తోంది. సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి రాసిన మ్యాజికల్ పదాలకు లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర స్వీట్, సోల్ ఫుల్ వాయిస్‌ను అందించారు. థమన్ అంతే అందమైన ట్యూన్‌తో అద్భుతంగా స్వరపరిచారు. ముగ్గురూ కలిసి తల్లి గురించి ఒక అందమైన రెండిషన్ అందజేశారు. ఈ పాట వింటుంటే.. తల్లి గురించిన జ్ఞాపకాలను నెమరువేస్తోంది. తెలుగులో అమ్మ గురించి కొన్ని క్లాసిక్ సాంగ్స్ వున్నాయి. ఈ పాట కూడా ఆ వరుసలో చేరుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ పాటతో ‘వారసుడు’ (Vaarasudu) చిత్రం పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ తెలియజేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు సంక్రాంతికి అద్భుతంగా ఆడటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సాంగ్ రిలీజ్ తర్వాత సినిమాకు మరో పాజిటివ్ వైబ్ తోడయిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. Soul of Vaarasudu (Telugu)

Updated Date - 2022-12-20T18:09:44+05:30 IST