Kottukkaali: సంగీత దర్శకుడు లేడు.. కోడిపుంజుకి పాత్ర.. ‘కొట్టుకాలి’ విశేషాలివే..
ABN, Publish Date - Aug 10 , 2024 | 12:00 PM
‘విడుదలై’, ‘గరుడన్’ చిత్రాల తర్వాత తాను హీరోగా నటించిన ‘కొట్టుకాలి’ చిత్రం వాస్తవ జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుందని ఆ చిత్ర హీరో సూరి అన్నారు. ప్రముఖ హీరో శివకార్తికేయన్ నిర్మాతగా ఎస్‌కె ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. పీఎస్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23వ తేదీ విడుదలకానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు టీమ్ చిత్ర విశేషాలను తెలియజేసింది.
‘విడుదలై’, ‘గరుడన్’ చిత్రాల తర్వాత తాను హీరోగా నటించిన ‘కొట్టుకాలి’ (Kottukkaali) చిత్రం వాస్తవ జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుందని ఆ చిత్ర హీరో సూరి (Soori) అన్నారు. ప్రముఖ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నిర్మాతగా ఎస్‌కె ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. పీఎస్ వినోద్‌రాజ్ (PS Vinothraj) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23వ తేదీ విడుదలకానుంది. దీనిని పురస్కరించుకుని, ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది టీమ్. ఇందులో భాగంగా హీరోయిన్ అన్నా బెన్ (Anna Ben)తో కలిసి హీరో సూరి చెన్నై నగరంలో మీడియాతో ముచ్చటించారు.
Also Read- Sobhita Dhulipala: పరిచయం ఎలా మొదలైనా.. హృదయాలు కలిసిపోయాయ్! శోభిత పోస్ట్ వైరల్
ఈ కార్యక్రమంలో సూరి మాట్లాడుతూ (Soori About Kottukkaali).. ‘‘నా గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుంది. ‘విడుదలై’, ‘గరుడన్’ చిత్రాలతో పోల్చితే పూర్తి భిన్నంగా, వైవిధ్య భరితంగా ఉంటుంది. ఇది మెయిన్ స్ట్రీమ్ కంటెంట్ మూవీ. వాస్తవ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే పాండి అనే పాత్ర ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉండే ఒక వ్యక్తి. ఈ సమాజం నేర్చించిన బంధుత్వాలు, నమ్మకాలను బలంగా విశ్వసించే ఒక పాత్రధారుడే పాండి. ఈ సమాజం తయారు చేసిన పాండి అనే పాత్రకు, నిజ జీవితంలో ఉండే పాండి అనే ఒక వ్యక్తికి మధ్య జరిగే మానసిక సంఘర్షణను వాస్తవ రూపంలో ప్రతిబింబించేందుకు ఎంతో శ్రద్ధ తీసుకున్నాం. ఆ పనిని సక్సెస్‌ఫుల్‌గా చేశామనే గట్టిగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రంగా ‘కొట్టుకాలి’ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను. ఇది ఒక ట్రావెల్ కథ. కోడిపుంజు కూడా ఓ పాత్ర పోషిస్తుంది. గ్రామీణ లొకేషన్‌లో చిత్రీకరించాం’’ అని పేర్కొన్నారు.
హీరోయిన్ అన్నా బెన్ మాట్లాడుతూ (Anna Ben About Kottukkaali).. ‘‘ఇందులో నా పాత్ర పేరు మీనా. ఇది నాలోని ఒక భాగమని తెలియదు. మనకు తెలియని అనేక అద్భుతమైన విషయాలను ఈ సినిమా వెల్లడిస్తుంది. ‘కొట్టుకాలి’లో మీనా ఎంత ప్రేమగా, మనోహరంగా ఉంటుందో అంతే బలంగా, దృఢంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో మదురై మీదుగా ప్రేక్షకులందరినీ తీసుకెళ్ళడానికి వేచిచూస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రానికి ఉన్న మరో విశేషం ఏమిటంటే.. సంగీత దర్శకుడు లేకుండా తెరకెక్కడం. ప్రకృతిలో సహజసిద్ధంగా ఉండే ధ్వనులను అనుకరిస్తూనే ఆయా సన్నివేశాలకు అన్వయించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.
Also Read- Mega vs Allu: ఈ మంట చల్లారెదెప్పుడో?
Read Latest Cinema News