Sardar 2: ‘సర్దార్‌-2’ షూటింగ్‌ షురూ..

ABN, Publish Date - Oct 13 , 2024 | 01:03 PM

2022లో కార్తీ హీరోగా.. రాశీఖన్నా, రజీషా విజయన్‌ హీరోయిన్లుగా వచ్చిన ‘సర్దార్‌’ చిత్రానికి రెండో భాగం చిత్రీకరణ శరవేగంగా సాగుతుంది. కార్తీ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు.

Sardar 2 Cast

2022లో కార్తీ హీరోగా.. రాశీఖన్నా, రజీషా విజయన్‌ హీరోయిన్లుగా వచ్చిన ‘సర్దార్‌’ (Sardar) చిత్రానికి రెండో భాగం చిత్రీకరణ శరవేగంగా సాగుతుంది. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు తమ సొంత నిర్మాణ సంస్థ ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కించారు. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ ‘సర్దార్ 2’ను దర్శక నిర్మాతలు పక్కాగా ప్లాన్‌ చేసి సెట్స్‌పైకి తీసుకెళ్ళారు. ఇందులో ఎస్‌జే సూర్య (SJ Suryah) కీలక పాత్ర పోషిస్తుండగా, హీరోయిన్లుగా మాళవికా మోహనన్‌, ఆషికా రంగనాథ్‌, రజీషా విజయన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు.

Also Read- Devara: ఫ్యాన్స్ కోసమే.. ‘దేవర’ కలెక్షన్స్‌పై నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు

గత నెల నుంచి నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్‌ జరుపుకుంటోందని.. ముగ్గురు హీరోయిన్లకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఇందులో హీరో కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యను మొదటి పార్ట్‌లో చాలా అర్థవంతంగా మేకర్స్ చూపించారు. ఈ పార్ట్‌లో ఏ సమస్యను దర్శకుడు టచ్ చేస్తున్నాడో అనేలా ఇప్పటికే ఈ సినిమాపై క్రేజ్ మొదలైంది.

Also Read- Nara Family Marriage: నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే?


అందరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందని, మొదటి పార్ట్‌ని మించి రెండో పార్ట్‌లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని మేకర్స్ భరోసా ఇస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా.. మేకర్స్ మాత్రం షూటింగ్‌ను ఆపకుండా.. శరవేగంగా చిత్రీకరణ జరిపే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ని మేకర్స్ ఇవ్వనున్నారని తెలుస్తుంది.

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2024 | 01:03 PM