విజయ్‌ చిత్రంలో.. కమలహాసన్‌?

ABN, Publish Date - Jul 24 , 2024 | 03:12 PM

స్టార్‌ హీరో విజయ్ చిత్రంలో విశ్వనటుడు కమలహాసన్ అతిథి పాత్రను పోషించనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. వివ‌రాల్లోకి వెళితే..

vijay

స్టార్‌ హీరో విజయ్ (Thalapathy VIJAY) చిత్రంలో విశ్వనటుడు కమలహాసన్ (Kamal Hasan) అతిథి పాత్రను పోషించనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు నటీనటులు తమతమ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. వెంకట్‌ ప్రభు రూపొందించిన ‘ది గోట్’ (The GOAT)చిత్రంలో విజయ్‌ నటిస్తున్నారు. ఆ తర్వాత హెచ్‌.వినోద్‌ (H Vinoth) దర్శకత్వంలో మరో చిత్రంలో నటించేందుకు కమిట్‌ అయ్యారు.

అలాగే, కమల్‌ కూడా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహిస్తున్న ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమాలో నటిస్తున్నారు. అయితే, హెచ్‌.వినోద్ (H Vinoth) దర్శకత్వంలో కమల్‌-233 రూపొందాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.


ఇపుడు కమల్‌కు చెప్పిన స్టోరీతోనే విజన్హ్స్య్ హెచ్‌.వినోద్ (H Vinoth) సినిమా చేస్తున్నారు. ఇది విజయ్ (Thalapathy VIJAY) నటించే 69వ చిత్రం. ఇందులో కమల్ (Kamal Hasan) అతిథి పాత్రను పోషించనున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ వార్తలు నిజమైతే.. విజయ్‌ - కమల్‌ కలిసి తొలిసారి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది.

Updated Date - Jul 24 , 2024 | 03:12 PM