2K Love Story: ‘2కే లవ్‌స్టోరీ’తో పరిచయం అవుతోన్న మరో నూతన హీరో.. ఎవరంటే

ABN, Publish Date - Oct 09 , 2024 | 08:54 AM

చిత్రపరిశ్రమకు మరో కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ కొత్త నటుడిని సీనియర్‌ నటుడు రామరాజన్‌ మీడియాకు పరిచయం చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత సుశీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంతో హీరోగా పరిచయం అవుతోన్న ఆ హీరో, చిత్ర విశేషాలు ఇవే..

2K Love Story Movie Team

తమిళ చిత్రపరిశ్రమకు మరో కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ కొత్త నటుడు జెగవీర్‌ని సీనియర్‌ నటుడు రామరాజన్‌ (Ramarajan) మీడియాకు పరిచయం చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత సుశీంద్రన్‌ (Suseenthiran) దర్శకత్వంలో జెగవీర్‌ (Jagaveer) హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ‘2కే లవ్‌స్టోరీ’ (2K Lovestory) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సిటీ లైట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మాత విఘ్నేష్‌ సుబ్రమణియన్‌ నిర్మిస్తున్నారు. నేటి ఆధునిక యువత జీవితాన్ని తెలుపుతూ రొమాన్స్‌ జానర్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీంతో హీరో పరిచయ కార్యక్రమాన్ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ‘మక్కల్‌ నాయగన్‌’ రామరాజన్‌ పాల్గొని యువనటుడు జెగవీర్‌ను మీడియా మిత్రులకు పరిచయం చేశారు.

Also Read- Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో షాయాజీ షిండే భేటీ.. ప్రయత్నం ఫలిస్తుందా


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుశీంద్రన్‌ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని జెగవీర్‌ దక్కించుకున్నారు. ఈ సినిమాకు మీడియా కూడా సపోర్టు చేయాలి. అందరూ కొత్త నటీనటులతో చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. దర్శకుడు సుశీంద్రన్‌ మాట్లాడుతూ, ‘వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ వృత్తిలో ఉండే స్నేహితుల బృందం జీవితాల్లో చోటుచేసుకునే సంఘటన ఆధారంగా ప్రతి ఒక్కరికీ నచ్చేలా డిజైన్‌ చేశాం. సినిమాకు డి.ఇమ్మాన్‌ సంగీతం మరింత బలం. జెగవీర్‌ సరసన మీనాక్షి గోవిందరాజన్‌ నటించారు. వీరితో పాటు బాల శరవణన్‌, ఆంటోనీ భాగ్యరాజ్‌, జయప్రకాష్‌, వినోదిని తదితరులు నటించారని తెలిపారు.


హీరో జెగవీర్‌ మాట్లాడుతూ.. ఒక నటుడిని హీరో లేదా జీరో చేసే శక్తి మీడియాకే ఉంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఒక ప్రాజెక్టుకు ఒక మంచి లీడర్‌ ఉంటే, ఆ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవుతుంది. అందుకు నిదర్శనం సుశీంద్రనే. ఆయన దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఓ మంచి సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ‘మక్కల్‌ నాయగన్‌’ రామరాజన్‌‌గారికి, మీడియా మిత్రులకు, సహనటులకు, సాంకేతిక వర్గానికి, దర్శకనిర్మాతలకు అందరికీ కృతజ్ఞతలని అన్నారు.

Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2024 | 08:54 AM