Jama: వీధి కళాకారుల జీవనచిత్రం ‘జమా’.. వారితోనే ఇళయరాజా పాటలు పాడించారు

ABN, Publish Date - Jul 07 , 2024 | 08:57 AM

వీధి కళకారుల జీవనశైలి, తదితర కథాంశంతో రూపొందిన త‌మిళ చిత్రం ‘జమా’. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

jama

గతంలో వీధి కళకారుల జీవనశైలి, తదితర కథాంశాలతో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకులను ఆలరించాయి. వీటికి కాస్త భిన్నంగా ‘జమా’ (Jama) పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ‘ఇసైఙ్ఞాని’ ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి పారి ఇలవళగన్ (Pari Elavazhagan) దర్శకత్వం వహించి హీరోగా నటించారు.

ఈ సినిమా గురించి దర్శకుడు పారి ఇలవళగన్ (Pari Elavazhagan) మాట్లాడుతూ.. ‘చిన్న బడ్జెట్‌ సినిమా అయినప్పటికీ. ఈ కథ వినగానే సంగీతం అందించేందుకు ఇళయరాజా (Ilaiyaraaja) ముందుకు వచ్చారు. ఈ చిత్రంలోని పాటల సంగీతం కోసం వీధి కళాకారులు ఉపయోగించే సంగీత వాయిద్య పరికరాలనే ఇళయరాజా ఉపయోగించారన్నారు.


ముఖ్యంగా ఇందులో పాటలు పాడేందుకు కూడా వీధి కళాకారులను తన స్టూడియోకు పిలిపించి వారితోనే పాటలు పాడించారు. ప్రత్యేకించి ఒక వేషం కోసం పురుషులు ఆడ వారిగా నటించే సమయంలో వారు ఎదుర్కొనే భావోద్వేగాలు, మానసిక మార్పులు, ఇతర సవాళ్ళను ఇందులో వివరించామ‌రు. తిరువణ్ణామలై, విల్లుపురం, కళ్ళకుర్చి వంటి కొన్ని జిల్లాల్లో అధికంగా ఉండే వీధి కళాకారుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రధానంగా చూపించామ‌న్నారు.

ఈ సినిమాను లెర్న్‌ అండ్‌ టీచ్‌ ప్రొడక్షన్స్ (LEARN AND TEACH PRODUCTION) పతాకంపై సాయి దేవానంద్‌ నిర్మించారు’. హీరోయిన్‌గా అమ్ము అభిరామి (Ammu Abhirami) నటించగా, ఇతర పాత్రల్లో చేతన్‌, శ్రీకృష్ణ దయాళ్‌, కేవీఎన్‌ మణిమేగలై, కళా కుమార్‌, వంసత్‌ మారిముత్తు, శివమారన్‌ తదితరులు నటించారు. 35 రోజుల్లో సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసినట్టు దర్శకుడు పారి ఇలవళగన్‌ వెల్లడించారు.

Updated Date - Jul 07 , 2024 | 09:26 AM