Priyanka: తమిళం నేర్చుకుంటానంటోన్న కన్నడ బ్యూటీ
ABN, Publish Date - Mar 02 , 2024 | 10:49 AM
తన మాతృభాష కన్నడం అయినప్పటికీ.. తమిళంలో అనర్గళంగా మాట్లాడాలన్నదే తన కల అని శాండల్‌వుడ్ హీరోయిన్ ప్రియాంక దిమ్మేష్ అన్నారు. కన్నడంలో పలు చిత్రాల్లో నటించిన ఆమె.. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘సత్తమిండ్రి ముత్తం తా’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
తన మాతృభాష కన్నడం అయినప్పటికీ.. తమిళంలో అనర్గళంగా మాట్లాడాలన్నదే తన కల అని శాండల్‌వుడ్ హీరోయిన్ ప్రియాంక దిమ్మేష్ (Priyanka Thimmesh) అన్నారు. కన్నడంలో పలు చిత్రాల్లో నటించిన ఆమె.. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘సత్తమిండ్రి ముత్తం తా’ (Sathamindri Mutham Tha) చిత్రం ద్వారా కోలీవుడ్ (Kollywood)కు పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘కొన్నేళ్ళ విరామం తర్వాత మళ్ళీ కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నా. ఈ సినిమాలో నాకు అవకాశం అనుకోకుండా లభించింది. నా మేనేజరు, హీరో శ్రీకాంత్ (Srikanth) మేనేజర్లు స్నేహితులు కావడంతో ఈ అవకాశం వచ్చింది. ఇందుకోసం నేను శ్రీకాంత్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ స్టోరీ దర్శకుడు వివరించే సమయంలోనే నాకు బాగా నచ్చింది. అందుకే సినిమా బాగా వచ్చేందుకు వీలుగా నా వంతు కృషి చేస్తానని చెప్పాను.
దర్శకుడు చెప్పినట్టుగా నడుచుకున్నాను. నేను తమిళం నేర్చుకుంటున్నాను. తమిళ భాష బాగా నేర్చుకుని సినీ అవకాశాలు పొందాలన్నదే నా కోరిక. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లోకెల్లా ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Jr NTR: ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, రిషభ్ శెట్టి, ప్రశాంత్ నీల్.. ఏంటి కథ?
**************************
*Tamannaah: ‘ఓదెల 2’ లో..
********************************
*Rashmika Mandanna: టోక్యో ఎయిర్ పోర్ట్‌లో రష్మికకు సర్‌ప్రైజింగ్ వెల్కమ్
********************************
*Prashanth: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు
****************************