Vishal: బాలీవుడ్, టాలీవుడ్‌లను మించేలా ‘ఐకానిక్’గా నడిగర్ సంఘం భవనం
ABN, Publish Date - Apr 16 , 2024 | 04:05 PM
నడిగర్ సంఘం కోసం టి.నగర్ హబీబుల్లా రోడ్డులో నిర్మించే భవనం నగరంలోనే ఒక ఐకానిక్ భవనంగా ఉంటుందని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, సినీ హీరో విశాల్ తెలిపారు. తమిళ సినిమా జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో తాజాగా చెన్నై నగరంలో జరిగిన తమిళ కొత్త సంవత్సరాది ఉగాది వేడుకలలో హీరో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నడిగర్ సంఘం కోసం టి.నగర్ హబీబుల్లా రోడ్డులో నిర్మించే భవనం నగరంలోనే ఒక ఐకానిక్ భవనం (Iconic Building)గా ఉంటుందని నడిగర్ సంఘం (Nadigar Sangam) ప్రధాన కార్యదర్శి, సినీ హీరో విశాల్ (Hero Vishal) తెలిపారు. తమిళ సినిమా జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో తాజాగా చెన్నై నగరంలో జరిగిన తమిళ కొత్త సంవత్సరాది ఉగాది వేడుకలలో హీరో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన నడిగర్ సంఘం భవనానికి (Nadigar Sangam Building) సంబంధించి సంచలన విషయాలను చెప్పుకొచ్చారు.
*Gaami: జీ5లో దుమ్మురేపుతోన్న ‘గామి’.. మూడు రోజులలోనే రికార్డ్స్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నడిగర్ సంఘం భవన నిర్మాణం ఈ యేడాది ఆఖరు నాటికి పూర్తి కావొచ్చన్నారు. ఆయా భాషల చిత్రపరిశ్రమలకు హైదరాబాద్, ముంబై నగరాల్లో మంచి ఆడిటోరియాలున్నాయి. ఆ తరహా సౌకర్యాలు మనకు లేవు. అందుకే నడిగర్ సంఘం భవాన్ని నగరంలోనే ఒక ఐకానిక్‌గా నిర్మించాలన్న తపన మా కార్యవర్గ సభ్యులందరిలో ఉంది. అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నాం. ఈ భవనంలో పెద్ద ఆడిటోరియం, సినిమా ఈవెంట్స్ జరుపుకునేందుకు వీలుగా థియేటర్, నడిగర్ సంఘం సభ్యులు తమ పిల్లలకు ఉచితంగా వివాహం చేసుకునేందుకు వీలుగా ఒక కల్యాణ మండపం, థియేటర్ ఆర్టిస్టులు, స్టేజ్ కళాకారులు నాటకాలు ప్రదర్శించుకునేందుకు అనువుంగా మరో థియేటర్, మాట్లాడుకునేందుకు ఒక సెంటర్, దాదాపు వంద నుంచి 130 కార్లు పార్కింగ్ చేసుకునేలా విశాలమైన పార్కింగ్ స్థలం ఇలా అనేక అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నాం. (Hero Vishal about Nadigar Sangam Building)
ముఖ్యంగా థియేటర్ ఆర్టిస్టులను పోత్సహించేలా నడిగర్ సంఘం చర్యలుంటాయి. ఈ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత నా పెళ్ళి గురించి ఆలోచన చేస్తాను. ‘చెల్లమే’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుపెట్టిన నేను రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నానని, దీనికి కారణం... ఓపిక ముఖ్య కారణం. వర్థమాన, ఔత్సాహిక నటీనటులు సినిమా అవకాశాల కోసం ఓపికతో వేచిచూడాలి’ అని కోరారు. కార్యక్రమంలో టీఎంజేఏ అధ్యక్షుడు కవిత, కోశాధికారి ఒట్రాన్ దురై, టీఎంజేఏ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Pushpa 2 The Rule: 138 గంటలపాటు ట్రెండింగ్‌లో.. సరికొత్త రికార్డ్
*********************************
*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్
**********************