Vishal: పొలిటికల్ ఎంట్రీ, నూతన పార్టీ వార్తలపై విశాల్ ఏమన్నారంటే..
ABN, Publish Date - Feb 07 , 2024 | 04:53 PM
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బాటలో.. అదే ఇండస్ట్రీకి చెందిన హీరో విశాల్ కూడా నడవబోతున్నాడనేలా కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. విజయ్ స్థాపించినట్లుగా విశాల్ కూడా నూతన పార్టీని స్థాపించి.. రానున్న తమిళనాడు ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపధ్యంలో.. అలాంటిదేం లేదని తాజాగా విశాల్ ఓ లేఖను విడుదల చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) బాటలో.. అదే ఇండస్ట్రీకి చెందిన హీరో విశాల్ (Hero Vishal) కూడా నడవబోతున్నాడనేలా కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. విజయ్ స్థాపించినట్లుగా విశాల్ కూడా నూతన పార్టీని స్థాపించి.. రానున్న తమిళనాడు ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపధ్యంలో.. తాజాగా విశాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఓ లేఖను విడుదల చేశారు. నూతన పార్టీ అంటూ వస్తున్న వార్తలకు ఇందులో ఆయన క్లారిటీ ఇచ్చారు. అవన్నీ రూమర్స్‌గా ఆయన కొట్టిపారేశారు.
విశాల్ విడుదల చేసిన లేఖలో.. ‘‘నన్ను అభిమానిస్తున్న తమిళనాడు ప్రజలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. నటుడిగా, సమాజసేవకుడిగా నన్ను గుర్తించి.. ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలకు సేవ చేయాలని, కష్టాలలో ఉన్నవారికి సాయం చేయాలనే లక్ష్యంతోనే నా ఫ్యాన్స్ క్లబ్‌ను నిర్వహిస్తున్నా. దానిని ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ (విశాల్ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి జిల్లాల వారిగా, నియోజక వర్గాల వారిగా విస్తరించాలని నిర్ణయించాం. మా అమ్మ పేరు మీద నెలకొల్పిన ‘దేవి ఫౌండేషన్’ ద్వారా.. నిరుపేద విద్యార్థులకు, బాధిత రైతులకు సాయం అందిస్తున్నాం. అలాగే షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆ పరిసర ప్రాంతాలలోని ప్రజల కష్టాలు, అవసరాలను తెలుసుకుని.. వారికి తగిన విధంగా సాయం చేస్తూ, వారికున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నాం. నేను చేస్తున్న ఈ సంక్షేమ పనులతో ఎప్పుడూ కూడా రాజకీయ లబ్ధిని ఆశించలేదు. అయితే.. భవిష్యత్తులో ప్రజల కోసం గొంతెత్తేందుకు వెనకాడను’’ అంటూ విశాల్ చెప్పుకొచ్చారు. (Vishal Letter on His Political Entry Rumours)
ఈ లేఖలోని సారాంశం ప్రకారం.. ప్రస్తుతానికైతే విశాల్ నూతన పార్టీ, రాజకీయ ఎంట్రీ లేనట్టుగానే తెలుస్తుంది. భవిష్యత్‌లో మాత్రం కచ్చితంగా ఆయన రాజకీయ బాట పట్టే అవకాశం అయితే లేకపోలేదు. అదే విషయం విశాల్ ఈ లేఖలో తెలియజేశారు. ఇదిలా ఉంటే.. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో ఇటీవల కొత్త పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్.. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోపు ఆయన అంగీకరించిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. విశాల్ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన హరి దర్శకత్వంలో ‘రత్నం’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. (Kollywood Hero Vishal)
ఇవి కూడా చదవండి:
====================
*Kiran Abbavaram: కొత్త దర్శకుడితో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్
**************************
*RRR: జక్కన్నపై మరోసారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ప్రశంసలు
******************************
*Varun Tej: ఫస్ట్ లావణ్య.. తర్వాత ఆ హీరోయిన్ అంటే ఇష్టం
**************************
*Rashmika Mandanna: ఏం చేయను.. మీడియా అలా రాస్తోందని చెబుతా..
******************************