Vijayakanth: ముఖ్యమంత్రి కావాల్సిన నేత విజయకాంత్.. ఈ మాట ఎవరన్నారంటే?
ABN, Publish Date - Jan 05 , 2024 | 10:24 AM
స్థానిక కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఖననం చేసిన విజయకాంత్ సమాధికి తన చిన్న కుమారుడు, హీరో కార్తీతో కలిసి శివకుమార్ గురువారం నివాళులు అర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన నేత కెప్టెన్ విజయకాంత్ అని సీనియర్ నటుడు శివకుమార్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన నేత కెప్టెన్ విజయకాంత్ అని సీనియర్ నటుడు శివకుమార్ అభిప్రాయపడ్డారు. స్థానిక కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఖననం చేసిన విజయకాంత్ సమాధికి తన చిన్న కుమారుడు, హీరో కార్తీతో కలిసి శివకుమార్ గురువారం నివాళులు అర్పించారు.
ఆ తర్వాత హీరో కార్తీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘విజయకాంత్ ఇపుడు మనమధ్య లేరనే విషయం జీర్ణించుకోలేనిది. ఆయన అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించలేకపోయామనే విషయం జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. కెప్టెన్‌తో సన్నిహితంగా మెలిగే అదృష్టం నాకు లభించలేదు. ఆయన చిత్రాలంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా పోలీస్ పాత్రలు వేసిన చిత్రాల్లో ఒక్కోదానిని కనీసం పది సార్లు చూసివుంటాను. నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆయనను కలుసుకున్నపుడు ఎంతో సంతోషంగా మాట్లాడారు. అదే ఆయన మా అందరితో బాగా మాట్లాడిన తరుణం. నడిగర్ సంఘంలో ఏదేని పెద్ద సమస్య ఉత్పన్నమైతే ఆయనను ఙ్ఞప్తికి తెచ్చుకుంటాం. నాయకుడు అంటే ముందుండి, క్షేత్రస్థాయిలో పనిచేసే లక్షణం కలిగివుండాలి. ఇలాంటి విషయాలు ఆయనను చూసి నేర్చుకున్నాం’’ అని తెలిపారు.
నటుడు శివకుమార్ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి ఇపుడు మనకు భౌతికంగా దూరం కావడం ఎంతో బాధగా ఉంది. ఆయనతో నాకు చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాననే బాధ నాలో ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Guntur Kaaram: సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?
******************************
*దీనస్థితిలో ఉన్న నటి పావల శ్యామలకు ‘మనం సైతం’ సాయం
**************************
*Tripti Dimri: ఈ నయా నేషనల్ క్రష్ గురించి.. ఈ విషయాలు తెలుసా?
************************