Pechi Movie: జర్నలిస్టులు.. రివ్యూలు పాజిటివ్‌గా రాస్తారని తెలిసింది

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:10 PM

జర్నలిస్టులు.. రివ్యూలు పాజిటివ్‌గా రాస్తారని ఈ సినిమాతో మాకు తెలిసిందని నిర్మాత ముజీఫ్ అన్నారు. ఆయ‌న నిర్మించిన ‘పేచి’ చిత్రం ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి హౌస్‌పుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతుంది. ఈ క్ర‌మంలో స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు.

pechi

చిన్న చిత్రాల విజయమే తమిళ చిత్రపరిశ్రమకు ప్రాణం అని ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్‌ డిస్ట్రిబ్యూషన్‌ హెడ్‌ గుహన్‌ అన్నారు. వెయిలోన్‌ ఎంటర్‌టైన్మెంట్ (Veyilon Entertainment) సమర్పణలో గోకుల్‌ బినాయ్‌, వెరూస్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై ముజీఫ్‌ నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్‌ రామచంద్రన్‌ బి కథను సమకూర్చి దర్శకత్వం వహించిన చిత్రం ‘పేచ్చి’(Pechi). ఈనెల 2న విడుదలైంది. గాయత్రి శంకర్ (Gayathrie shankar), బాలశరవణన్ (Bala saravanan), దేవ్‌, జానా, ప్రీతి, మహేష్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడంతో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. దీంతో చిత్ర విజయోత్సవాలను ఇటీవలచెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా గుహన్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా తమిళనాడు సరిహద్దులను దాటి కర్ణాటక రాష్ట్రంలో కూడా విశేష ఆదరణ లభిచండం సంతోషంగా ఉంది. కమర్షియల్‌ పరంగా హిట్‌ సాధించింది. తమిళ చిత్రపరిశ్రమకు చిన్న సినిమాల సక్సెస్‌ ఊపిరి వంటిది. ‘పేచ్చి’ తరహా సినిమాలు నిర్మించినపుడే చిత్ర పరిశ్రమ మనుగడ సాగించగలదు’ అని తెలిపారు.


GUjYOL6WsAUjUAB.jpeg

నిర్మాత ముజీఫ్‌ మాట్లాడుతూ.. ‘మీడియా ఇచ్చిన పాజిటివ్‌ రివ్యూలు ఈ సినిమా సక్సెస్ కు కారణమని. కంటెంట్‌ బాగుంటే జర్నలిస్టులు కూడా రివ్యూలు పాజిటివ్‌గానే రాస్తారని అర్థం చేసుకున్నా. ఈ విజయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. దర్శకుడు రామచంద్రన్‌ మాట్లాడుతూ.. ‘ఒక చిత్రానికి, డెబ్యూ డైరెక్టర్‌కి న్యాయనిర్ణేతలు పాత్రికేయులే. వారిచ్చే తీర్పుపైనే ఆ సినిమా సక్సెస్‌, డెబ్యూ డైరెక్టర్‌ కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాను చూసిన పలువురు పాత్రికేయులు భుజంతట్టి అభినందించారు. అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. సినిమా ఇంత హిట్‌ కావడానికి మీడియానే కారణం’ అని పేర్కొన్నారు. అలాగే, నిర్మాత బినాయ్‌, నటుడు బాలశరవణన్‌ తదితరులు ప్రసంగించారు.

Updated Date - Aug 11 , 2024 | 03:10 PM