PECHI: గుండె సమస్యలు ఉంటే ఈ సినిమా చూడొద్దు.. థియేట‌ర్ల‌లో బెంబేలెత్తిస్తున్న ‘పేచ్చి’

ABN , Publish Date - Aug 07 , 2024 | 04:37 PM

ఇటీవ‌ల విడుదలైన త‌మిళ‌ హ‌ర్ర‌ర్ చిత్రం ‘పేచి’ అద్భుత‌మైన పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతోంది. అయితే గుండె సమస్యలతో ఉన్న‌వారు సాహసం చేసి ఈ సినిమాకు చూసేందుకు వెళ్ళాలని ప్రేక్షకులు సలహా ఇస్తున్నారు.

pechi

నిర్మాతలు గోకుల్‌ బినాయ్‌, షేక్‌ ముజీబ్‌ సంయుక్తంగా బి.రామచంద్రన్ (Ramachandran) దర్శకత్వంలో నిర్మించిన ‘పేచి’ (PECHI) చిత్రం ఈ నెల రెండో తేదీన విడుదలై పాజిటివ్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. దీంతో చిత్ర బృందం ఓ థియేటర్‌లో ప్రేక్షకుల సమక్షంలోనే సక్సెస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించింది. వెయిలాన్‌ ఎంటర్‌టైన్మెంట్ (Veyilon Entertainment) పతాకంపై రామచంద్రన్‌ కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. గాయత్రి శంకర్ (Gayathrie shankar), బాలశరవణన్ (Bala saravanan), దేవ్‌, జానా, ప్రీతి, మహే్‌షలు ప్రధాన పాత్రలు పోషించారు.

Dx2Zq4kV4AA3TWN.jpeg

నిషేధిత కొండ ప్రాంతంపైకి ఐదుగురు స్నేహితులు ఫారెస్ట్‌ అధికారుల ఆంక్షలను కూడా టెక్కింగ్‌కు వెళతారు. అక్కడ ‘పేచి’ (PECHI) అనే దెయ్యం చేతిలో చిక్కుకుంటారు. ఆ తర్వాత వారు అక్కడ నుంచి ఎలా తప్పించుకున్నారు? అనే అంశాలను ఎంతో ఆసక్తికరంగా, ప్రేక్షకుల ఉత్కంఠతకు లోనయ్యేలా దర్శకుడు తెరకెక్కించారు.

GUJGJC_XkAAwKVk.jpeg

సాధారణ ప్రేక్షకులే అమితంగా భయపెడేలా ప్రతి సన్నివేశం ఉంది. గుండె సమస్యలతో బాధపడే వారు సాహసం చేసి ఈ సినిమాకు చూసేందుకు వెళ్ళాలని మూవీని చూసిన ప్రేక్షకులు సలహా ఇస్తున్నారు.


స్క్రీన్‌ప్లేతో పాటు కెమెరా పనితనం, విజువలైజేషన్‌, ఎడిటింగ్‌, సంగీతం ఇలా ప్రతి అంశం ఎంతో బాగుందని వారు పేర్కొంటున్నారు. పైగా, విడుదలైన తొలి ఆట నుంచే మంచి స్పందన రావడంతో సినిమా ప్రదర్శించే స్క్రీన్ల సంఖ్యను కూడా క్రమంగా పెంచుతున్నారు.

GUJdL-yXIAENj_K.jpeg

దీంతో దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తూ సక్సెస్‌ వేడుకలను నిర్వహించారు. ఈ ‘పేచి’ (PECHI) సినిమా ప్రదర్శిస్తున్న వడపళని మాల్‌లో ఉన్న థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఇదిలాఉండ‌గా IMDbలో 9.6 రేటింగ్ ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం.

GUJdL-kWcAA00mF.jpeg

Updated Date - Aug 07 , 2024 | 04:38 PM