మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Goundamani vs Yogibabu: ఎన్నికల్లో గౌండమణి - యోగిబాబు పోటీ... ఎవరు గెలిచారు?

ABN, Publish Date - Jun 15 , 2024 | 12:19 PM

సీనియర్‌ హాస్య నటుడు గౌండమణి హీరోగా నటించిన చిత్రం ‘ఒత్త ఓటు ముత్తయ్య’. ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు ఒక కీలక పాత్ర పోషించారు. రాజకీయ సెటైర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సాయి రాజ్‌ గోపాల్‌ దర్శకత్వం వహించారు. సినీ క్రాఫ్ట్స్‌ పతాకంపై రవిరాజా నిర్మించగా, సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీతం అందించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు.

Goundamani vs Yogibabu

సీనియర్‌ హాస్య నటుడు గౌండమణి (Goundamani) హీరోగా నటించిన చిత్రం ‘ఒత్త ఓటు ముత్తయ్య’ (Otha Ottu Muthaiya). ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు (Yogibabu) ఒక కీలక పాత్ర పోషించారు. రవిమారియ, రాజేంద్రన్‌, వయ్యాపురి, సింగముత్తు, వాసన్‌ కార్తీక్‌, సీనియర్‌ హాస్య నటుడు దివంగత నగేష్‌ మనవడు గజేష్‌, రాజేశ్వరి తదితరులు నటించారు. రాజకీయ సెటైర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సాయి రాజగోపాల్‌ (Sai RajaGopal) దర్శకత్వం వహించారు. ఈయన గతంలో ‘సుందరి నీయుం సుందరన్‌ నానుం’, ‘కిచ్చా వయసు 16’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. సుమారుగా 70కు పైగా చిత్రాల్లో గౌండమణి - సెంథిల్‌కు కామెడీ ట్రాక్‌లు అందించారు. (Otha Ottu Muthaiya Update)

Also Read- Niharika Konidela: అల్లు అర్జున్‌ని సాయి దుర్గా తేజ్ అన్ ఫాలో చేయడంపై నిహారిక స్పందనిదే..


సినీ క్రాఫ్ట్స్‌ పతాకంపై రవిరాజా (Ravi Raja) నిర్మించగా, సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఫస్ట్‌లుక్‌పై పదవీ ప్రమాణ స్వీకారోత్సవంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు అని పొందుపరిచారు. ఒక రాజకీయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌండమణి ఒక్క ఓటు తేడాతో విజయం సాధిస్తారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన యోగిబాబు... గౌండమణిని ఓడించారా? లేదా? అన్నదే చిత్ర కథ. ఈ స్ర్కిప్టును పూర్తి హాస్యభరితంగా, పొలిటికల్‌ సెటైరికల్‌గా తెరకెక్కించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.


గౌండమణి - యోగిబాబు.. వీరిద్దరూ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. మా ఇద్దరికీ పోటా పోటీగా నటించే ఛాన్స్ వచ్చింది. ఇద్దరిలో ఎవరు గెలిచారు? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. రొటీన్‌గా కాకుండా.. సరికొత్తగా ఇందులో కామెడీ చేసే అవకాశం వచ్చింది. మా ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్ ఉంటుంది. ప్రతి ఒక్కరినీ నవ్విస్తూనే.. ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉంటుందని, త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. (Goundamani vs Yogibabu)

Read Latest Cinema News

Updated Date - Jun 15 , 2024 | 12:19 PM