40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫిబ్రవరి మొదటి శుక్రవారం నాలుగు చిత్రాల మధ్య పోటీ..

ABN, Publish Date - Jan 31 , 2024 | 03:49 PM

కొత్త సంవత్సరంలోని మొదటి నెల జనవరి గడిచిపోయింది. రెండో నెల ఫిబ్రవరి మొదటి శుక్రవారం కోలీవుడ్‌లో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో హాస్య నటుడు సంతానం నటించిన ‘వడకుప్పట్టి రామస్వామి’, విదార్థ్‌- పూర్ణ నటించిన ‘డెవిల్‌’, రక్షన్‌ హీరోగా నటించిన ‘మరక్కుమా నెంజం’, సాత్విక్‌ వర్మతో పాటు పలువురు కలిసి నటించిన ‘చిక్లెట్స్’ చిత్రాలున్నాయి.

కొత్త సంవత్సరంలోని మొదటి నెల జనవరి గడిచిపోయింది. రెండో నెల ఫిబ్రవరి మొదటి శుక్రవారం కోలీవుడ్‌లో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో హాస్య నటుడు సంతానం నటించిన ‘వడకుప్పట్టి రామస్వామి’, విదార్థ్‌- పూర్ణ నటించిన ‘డెవిల్‌’, రక్షన్‌ హీరోగా నటించిన ‘మరక్కుమా నెంజం’, సాత్విక్‌ వర్మతో పాటు పలువురు కలిసి నటించిన ‘చిక్లెట్స్’ చిత్రాలున్నాయి. వివరాల్లోకి వెళితే..

‘డిక్కిలోనా’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత సంతానం - కార్తీక్‌ యోగి కాంబినేషన్‌లో ‘వడకుప్పట్టి రామస్వామి’ రూపుదిద్దుకుంది. పూర్తి హాస్యభరిత సినిమాగా రూపుదిద్దుకోగా, మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటించారు. ప్రముఖ దర్శకుడు మిష్కిన్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘డెవిల్‌’. మిష్కిన్‌ సోదరుడు ఆదిత్య దర్శకత్వం వహించారు. విదార్థ్‌, త్రిగుణ్‌, పూర్ణ, శుభశ్రీ ప్రధాన పాత్రలను పోషించారు.


రక్షన్‌ హీరోగా నటించిన ‘మరక్కుమా నెంజమ్‌’ చిత్రం మలినా, రాహుల్‌ వంటి అనేక మంది నటించారు. ఇది ఒక స్కూల్‌ లైఫ్‌ లవ్‌ స్టోరీ. ముత్తు దర్శకత్వంలో సాత్విక్‌ వర్మ, జాక్‌ రాబిన్‌సన్‌, నయన్‌ కరిష్మా, అమృత హల్తార్‌ నటించిన చిత్రం ‘చిక్లెట్స్’. 2కే కిడ్స్‌ రొమాన్స్‌ కథగా ట్రైలర్‌లోనే చూపించారు. గత యేడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. మొత్తంగా చూస్తే.. ఈ వారం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కనిపించనుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు.. విడుదల ఎప్పుడంటే?

**************************

*ఇళయరాజాను పరామర్శించిన మోహన్ బాబు

***********************

*పద్మశ్రీ గ్రహీతలను సత్కరించిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి

*****************************

*Pushpa2: అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ ఫొటో లీక్.. సుకుమార్ ఫైర్

***********************

Updated Date - Jan 31 , 2024 | 03:49 PM