మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Double Tuckerr: ఐదు నిమిషాల్లో కథ చెప్పి ఇంప్రెస్‌ చేయగలవా..

ABN, Publish Date - Feb 25 , 2024 | 09:08 PM

భారతదేశంలోనే తొలిసారిగా యానిమేషన్‌ పాత్రలతో కలిసి డాక్టర్‌ ధీరజ్‌, స్మృతి వెంకట్‌, కోవై సరళ, ఎంఎస్‌ భాస్కర్‌ తదితరులు నటించిన ఫాంటసీ యాక్షన్‌ చిత్రం ‘డబుల్‌ టక్కర్‌’. ఏర్‌ఫ్లిక్‌ సంస్థ నిర్మాణ సారధ్యంలో.. మీరా మహతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి విద్యాసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విశేషాలను మేకర్స్ తెలియజేశారు.

భారతదేశంలోనే తొలిసారిగా యానిమేషన్‌ పాత్రలతో కలిసి డాక్టర్‌ ధీరజ్‌, స్మృతి వెంకట్‌, కోవై సరళ, ఎంఎస్‌ భాస్కర్‌ తదితరులు నటించిన ఫాంటసీ యాక్షన్‌ చిత్రం ‘డబుల్‌ టక్కర్‌’ (Double Tuckerr). ఏర్‌ఫ్లిక్‌ సంస్థ నిర్మాణ సారధ్యంలో.. మీరా మహతి (Meera Mahadhi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి విద్యాసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణులతో కలిసి దర్శక నటుడు మిష్కిన్‌ కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన చంద్రూ మాట్లాడుతూ... మూడేళ్ల క్రితం అపనమ్మకంతో వైరాగ్యంతో కొట్టుమిట్టాడుతున్న తనను హీరో ధీరజ్‌ ఆదుకుని స్ర్కీన్‌‌ప్లే విభాగంలోకి తీసుకొచ్చారని, మూడేళ్లు శ్రమించి పటిష్టమైన స్ర్కీన్‌ప్లే రూపొందించానని చెప్పారు. డబుల్‌ టక్కర్‌ చిత్రం విడుదలైన తర్వాత తమిళ కార్టూన్‌ చిత్రాలకు మోజు పెరగటం ఖాయమన్నారు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్న హీరోయిన్‌ స్మృతి వెంకట్‌ దర్శకుడు మిష్కిన్‌కు ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్‌ మీరా మహతి చాలా కూల్‌ అయిన డైరెక్టర్‌ అని, ఈ చిత్ర కథాగమనం పూర్తిగా ఎలాంటి టెన్షన్‌ లేకుండా సాఫీగా సాగుతుందని, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పారు. తన నటనకు సీనియర్‌ నటి కోవై సరళ మెరుగులుదిద్దారని తెలిపారు.

డైరెక్టర్‌ మీరా మహతి మాట్లాడుతూ... 12 యేళ్లుగా కఠోర శ్రమ తర్వాతే దర్శకురాలిగా తెరముందుకు వచ్చానని చెప్పారు. మైమ్‌గోపీ సాయంతో హీరో ధీరజ్‌ పరిచయమయ్యారని, కథ చెప్పగానే ఆయన చాలా సంతోషించారని తెలిపారు. ప్రారంభించేటప్పుడు ఈ చిత్రం లోబడ్జెట్‌గా ఉండేదని, అయితే యానిమేషన్‌ పాత్రలతో తీయటం వల్ల భారీ బడ్జెట్‌ చిత్రంగా అందరినీ ఆకట్టుకునేలా తయారైందన్నారు. ముఖ్య అతిథి, దర్శకుడు మిష్కిన్‌ మాట్లాడుతూ.. ధీరజ్‌ అంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటివరకూ డాక్టర్‌గా సుమారు 500 మంది ప్రాణాలను కాపాడి ఉంటారని, ఆయన ఓ హార్ట్‌ స్పెషలిస్ట్‌ అని, ముఖ్యమంత్రి వైద్యబృందంలో ధీరజ్‌ కూడా ఉన్నారని, మంత్రి ఉదయనిధికి అత్యంత సన్నిహితుడని తెలిపారు. ధీరజ్‌ కోసమే తన చిత్రం షూటింగ్‌ రద్దు చేసుకుని మరీ ఈ ప్రెస్‌మీట్‌కు వచ్చానని చెప్పారు. (Double Tuckerr Press Meet)


హీరో ధీరజ్‌ మాట్లాడుతూ... దర్శకుడు మిష్కిన్‌ మాటలు తనను చాలా సంతోషపరిచాయని, చంద్రూ తన తొలిచిత్ర దర్శకుడని, సినిమాలకు సెన్సిటివ్‌ అంశాలతోపాటు ఎలాంటి కమర్షియల్‌ అంశాలుండాలో ఆయనకు బాగా ఎరుక అని చెప్పారు. ‘పిళ్ళయార్‌ సుళి’ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్‌ మీరా కథ చెప్పటానికి వచ్చారని, ఐదు నిమిషాల్లో కథ చెప్పి నన్ను ఇంప్రెస్‌ చేయగలవా? అని అడిగానని, చివరకు నాన్‌స్టాప్‌గా నవ్విస్తూ కథ చెప్పి ఇంప్రెస్‌ చేశారని పేర్కొన్నారు. కథ బాగా నచ్చటంతో ఈ ప్రాజెక్ట్‌కు ఒకే చెప్పానని తెలిపారు. హీరోయిన్‌ స్మృతి వెంకట్‌కు, సంగీత దర్శకుడు విద్యాసాగర్‌కు, ఎడిటర్‌ వెట్రికి, ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ చిత్రాన్ని ప్రతి ఇంటి కుటుంబీకులు వీక్షించే బాధ్యతను పాత్రికేయ మిత్రులపై పెడుతున్నానని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

====================

*Anjali: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. నాకెంతో స్పెషల్ ఫిల్మ్

******************************

*Masthu Shades Unnai Ra: థ్యాంక్స్ మీట్‌‌లో నిర్మాత ఎమోషనల్.. ఎందుకంటే?

*************************

*Nani32: ‘OG’ దర్శకుడితో నాని చిత్రం.. అధికారిక ప్రకటన వచ్చేసింది

*****************************

*Bhimaa Trailer: గోపీచంద్ ఊచకోత..

*****************************

Updated Date - Feb 25 , 2024 | 09:08 PM