Director Shankar: ప్రతి ఒక్కరి మనసులోని కోపమే ‘సేనాపతి’
ABN, Publish Date - Jul 07 , 2024 | 10:46 PM
సమాజంలోని ప్రతి ఒక్కరి మనసులో ఉన్న కోపం, ఆగ్రహావేశమే సేనాపతి పాత్ర అని దర్శకుడు ఎస్.శంకర్ అన్నారు. స్వీయ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్-2’ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని శనివారం చెన్నైలో శంకర్, కమల్, సిద్ధార్థ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమాజంలోని ప్రతి ఒక్కరి మనసులో ఉన్న కోపం, ఆగ్రహావేశమే సేనాపతి పాత్ర అని దర్శకుడు ఎస్.శంకర్ (Director Shankar) అన్నారు. స్వీయ దర్శకత్వంలో కమలహాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన ‘ఇండియన్-2’ (Indian 2) ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని శనివారం చెన్నైలో శంకర్, కమల్, సిద్ధార్థ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో దర్శకుడు శంకర్ (Shankar) మాట్లాడుతూ... ‘ఇండియన్’ చిత్రం తీసే సమయంలో రెండో, మూడు భాగాలు తీస్తానని కలలో కూడా ఊహించలేదు. ఇన్నేళ్ల తర్వాత రెండో భాగాన్ని తెరకెక్కించడానికి తొలి భాగంలో ఒక సన్నివేశంలో ఇండియన్ తాత పుట్టిన తేదీని వెల్లడించడమే కారణం. మర్మకళలో వందేళ్ళు పైబడిన సేనాపతి పాత్ర. తొలి భాగంలో కంటే రెండో భాగంలో కమల్ చాలా స్పష్టంగా కనిపిస్తారు. మేకప్‌లో వచ్చిన అధునాతన టెక్నాలజీనే దీనికి కారణం. సేనాపతి పాత్ర ప్రతి ఒక్కరిలో ఉండే కోపం, ఆగ్రహమే. అది ఏంటన్నది వెండితెరపై చూడాల్సిందే. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు కూడా సినిమా చాలా బాగా వచ్చిందని అభినందించారని అన్నారు. (Indian 2 Ready to Release)
హీరో కమల్ హాసన్ (Kamal Haasan) మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాణంలో ఎందరో గొప్ప నటీనటులు ఎంతగానో సహకరించి నటించారు. సినిమా నిర్మాణంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నాం. సినిమా ప్రారంభించిన తర్వాత చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కొవిడ్ మహమ్మారి, షూటింగ్ సమయంలో ప్రమాదాలు, చిత్రీకరణ నిలిచిపోవడం, న్యాయపరమైన చిక్కులు ఇలా అనేక అవాంతరాలు ఎదుర్కొన్నాం. నిర్మాణంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైన చిత్రం ఇదేనని చెబుతా. చివరగా సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు బాగుందని అభినందించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందఅని పేర్కొన్నారు. కాగా, లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్, రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఐశ్వర్య రాజేష్, బ్రహ్మానందం, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సముద్రగని తదితరులు నటించారు.