Bottle Radha: పా.రంజిత్‌ నిర్మాణంలో.. ‘బాటిల్‌ రాధ’

ABN, Publish Date - Jun 27 , 2024 | 11:17 AM

ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ తన సొంత సంస్థ నీలం ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ‘బాటిల్‌ రాధ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు.

bottile radha

ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ (pa.ranjith) తన సొంత సంస్థ నీలం ప్రొడక్షన్ (Neelam Productions) పతాకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ‘బాటిల్‌ రాధ’ (Bottle Radha)అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. గురు సోమసుందరం (Guru Somasundaram), సంచ‌న నటరాజన్ (Sanchana natarajan), జాన్‌ విజయ్ (John Vijay) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కామెడీ, ఎమోషనల్‌, రోలర్‌ కోస్టర్‌గా రూపొందిస్తున్నారు. దినకరన్‌ శివలింగం (Dhinakaran Sivalingam) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీన్‌ రోల్డన్ (Sean Roldan) సంగీతం సమకూర్చుతున్నారు.


కాగా, ‘అట్టకత్తి’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయమైన పా.రంజిత్ (pa.ranjith).. ఆ తర్వాత కార్తీతో తెరకెక్కించిన ‘మద్రాస్‌’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టి, తన మూడో చిత్రంతోనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రానికి డైరెక్ట్‌ చేసే గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేశారు.

అలా కోలీవుడ్‌లో తన జర్నీని కొనసాగిస్తున్న పా.రంజిత్‌.. నీలం ప్రొడక్షన్‌ అనే నిర్మాణ సంస్థ నెలకొల్పి సందేశాత్మక చిత్రాలను నిర్మిస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే 10 చిత్రాల వ‌ర‌కు నిర్మించిన రంజిత్ తాజాగా ఇప్పుడు ‘బాటిల్‌ రాధ’ (Bottle Radha) చిత్రాన్ని మంచి కథాంశంతో రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.

Updated Date - Jun 27 , 2024 | 11:17 AM