U R Next: ఐటీ రంగంపై వైవిధ్యమైన కథాంశంతో.. ‘యు ఆర్‌ నెక్స్ట్‌’ ప్రారంభం

ABN, Publish Date - Jun 30 , 2024 | 08:41 PM

ఐమ్యాక్‌ ఫిలిమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్కై ఫ్రేం ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్లపై నిర్మాతలు మొహిదీన్‌ అబ్దుల్‌ ఖాదర్‌, మణి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘యు ఆర్‌ నెక్స్ట్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎండీ షరీఫ్‌ ఈ చిత్రానికి కథను సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో తాజాగా జరిగింది.

U R Next Movie Launch Event

ఐమ్యాక్‌ ఫిలిమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్కై ఫ్రేం ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్లపై నిర్మాతలు మొహిదీన్‌ అబ్దుల్‌ ఖాదర్‌, మణి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘యు ఆర్‌ నెక్స్ట్‌’ (U R Next) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎండీ షరీఫ్‌ ఈ చిత్రానికి కథను సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో తాజాగా జరిగింది. కేఎస్‌ రవికుమార్‌ (KS Ravikumar), రచిత మహాలక్ష్మి, ఉదయ, జనని, దినేష్‌, దివ్య కృష్ణన్‌, అర్షద్‌, కేపీవై వినోద్‌, బుల్లెట్‌ సామి నటిస్తున్నారు. కేజీ రతీష సినిమాటోగ్రఫి. ‘ఇసైపేట్టై’ వసంత్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఐటీ రంగంలో ఉండే యువతను చుట్టుముట్టే సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని హర్రర్‌ మూవీగా తెరకెక్కిస్తున్నాం. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించి పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేస్తాం. ఈ సినిమా స్ర్కిప్టుపై మాకు ఎంతో నమ్మకం ఉంది. భారతీయ సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని బలంగా నమ్ముతున్నామని అన్నారు. (U R Next Movie Launch)


సీనియర్‌ దర్శక నటుడు కేఎస్‌ రవికుమార్‌ మాట్లాడుతూ... ఈ సినిమా స్ర్కిప్టు చాలా బలంగా ఉంది. వైవిధ్యభరితమైన కథాంశంతో దర్శకుడు ముందుకు వస్తున్నారు. ఇందులో నన్ను యంగ్‌గా చూపిస్తానని చెప్పారు. నా లుక్‌ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. నిర్మాతలకు చిత్రపరిశ్రమ కొత్తది అయినప్పటికీ సినిమాపై ప్రేమ, ఫ్యాషన్‌ వారిని ఇక్కడకు తీసుకొచ్చింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి మరిన్ని చిత్రాలు నిర్మించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. నటి దివ్య కృష్ణన్‌ మాట్లాడుతూ... ‘ఈ ప్రాజెక్టులో నన్ను భాగస్వామిని చేసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. కేఎస్‌ రవికుమార్‌ వంటి దర్శకుడితో కలిసి పనిచేసేందుకు అమితాసక్తితో ఎదురు చూస్తున్నా’ అని తెలిపారు.

Updated Date - Jun 30 , 2024 | 08:41 PM