Director: అమ్మ పాత్రలకు హీరోయిన్ల వెనుకంజ.. అందుకే!
ABN, Publish Date - Jul 05 , 2024 | 09:35 PM
అమ్మ పాత్రల్లో నటించేందుకు కోలీవుడ్ హీరోయిన్లు ముందుకు రావడం లేదని, అందువల్లే ఇతర భాషల హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందని ‘వన్ టు వన్’ దర్శకుడు తిరుజ్ఞానం అన్నారు. సుందర్ సి, అనురాగ్ కశ్యప్ నటించిన ఈ చిత్రంలో నీతూ చంద్ర, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ విపిన్ సంగీత స్వరాలు సమకూర్చారు. 24 హవర్స్ ప్రొడక్షన్స్ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు.
అమ్మ పాత్రల్లో నటించేందుకు కోలీవుడ్ హీరోయిన్లు ముందుకు రావడం లేదని, అందువల్లే ఇతర భాషల హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందని ‘వన్ టు వన్’ (One to One Movie) దర్శకుడు తిరుజ్ఞానం (Director K Thirugnanam) అన్నారు. సుందర్ సి, అనురాగ్ కశ్యప్ నటించిన ఈ చిత్రంలో నీతూ చంద్ర, రాగిణి ద్వివేది, విజయ్ వర్మన్, మానస్వి ప్రధాన పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ విపిన్ సంగీత స్వరాలు సమకూర్చారు. 24 హవర్స్ ప్రొడక్షన్స్ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు.
Also Read-Shyamala Devi: అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై ప్రభాస్‌తో సినిమా చేయిస్తా..
ఈ సందర్భంగా దర్శకుడు తిరుజ్ఞానం మాట్లాడుతూ.. ఇది చెన్నైలో జరిగిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ. బ్యాంకు అధికారిగా సుందర్ ఆయన భార్యగా రాగిణి ద్వివేది, ప్రతి నాయకుడిగా అనురాగ్ కశ్యప్ నటించారు. సుందర్ పాత్ర కంటే విలన్ పాత్ర గొప్పగా ఉంటుంది. డైలాగులను హిందీలో రాసుకుని తమిళంలో చెప్పారు. సినిమాకు ‘ఒత్తైకు ఒత్తై’ అనే పేరు పెట్టాలని భావించగా మరో చిత్రానికి పెట్టడంతో ‘వన్ టు వన్’ అని టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాతో మంచి థ్రిల్ ఫీలవుతారని కచ్చితంగా చెప్పగలను. కోలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు ఎవరూ అమ్మ పాత్రల్లో నటించడానికి ఇష్టపడటం లేదు. అందుకే కోలీవుడ్ నుంచి కాకుండా ఇతర భాషల హీరోయిన్లను అలాంటి పాత్రలకు ఎంపిక చేయాల్సి వస్తుంది. తమిళ నటీమణులు అమ్మ పాత్రలు కూడా చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నానని పేర్కొన్నారు.
Read Latest Cinema News