మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘లాల్‌సలాం’కు ధన్య బాలకృష్ణ రూపంలో చిక్కులు?.. సారీ చెప్పిన నటి..!

ABN, Publish Date - Feb 02 , 2024 | 08:18 PM

ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘లాల్‌సలాం’ చిత్రానికి.. చిత్రంలో నటించిన హీరోయిన్లలో ఒకరైన ధన్య బాలకృష్ణ రూపంలో ఓ సమస్య వచ్చిపడింది. ఇది ఆ చిత్రం విడుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కోలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. తమిళ నాడు ప్రజలని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లుగా ధన్య పై ఓ స్ర్కీన్‌ షాట్ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై తాజాగా ఆమె స్పందిస్తూ.. ఆ మాటలు తనవి కావని తెలిపింది.

Dhanya Balakrishna says Sorry to Lal Salaam Team

ఐశ్వర్య రజనీకాంత్‌ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘లాల్‌సలాం’ (Lal Salaam) చిత్రానికి.. చిత్రంలో నటించిన హీరోయిన్లలో ఒకరైన ధన్య బాలకృష్ణ రూపంలో ఓ సమస్య వచ్చిపడింది. ఇది ఆ చిత్రం విడుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కోలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విదార్థ్‌ హీరోలుగా నటించారు. ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna) ఒక హీరోయిన్‌. ఈనెల 9వ తేదీన విడుదలకానుంది. అయితే, ఇపుడు సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ధన్య... గతంలో తమిళ ప్రజలను కించపరిచేవిధంగా కామెంట్స్‌ చేశారు. బెంగళూరులో ఉంటున్న ధన్య.. గత యేడాది ఐపీఎల్‌ సీజన్‌ సమయంలో బెంగళూరు జట్టు ఆర్సీబీకి మద్దతు ప్రకటించి, తమిళ ప్రజలను హేళనగా మాట్లాడారు. ఆ సమయంలో ఆ కామెంట్స్‌ పెనుచర్చకు దారి తీశాయి. ఈనేపథ్యంలో ఆమె తమిళ చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇపుడు ‘లాల్‌సలాం’లో ఒక హీరోయిన్‌గా నటించగా, గతంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలను ఇపుడు నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ‘తమిళ ప్రజలను అవమానించేలా మాట్లాడిన ధన్య బాలకృష్ణకు ఐశ్వర్య ఏవిధంగా తన సినిమాలో అవకాశం ఇస్తారు’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ‘లాల్ సలాం’ చిత్ర తమిళనాడు రాష్ట్రంలో విడుదలైన చిక్కులు తలెత్తాయి. (Dhanya Balakrishna Says Sorry)


అయితే ఈ వివాదంపై ధన్య తాజాగా స్పందించింది. నాకు తిండి పెడుతోన్న సినీ పరిశ్రమపై ప్రమాణం చేసి చెబుతున్నా.. సోషల్ మీడియాలో తమిళనాడును ఉద్దేశించి నేను అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారమవుతున్న స్ర్కీన్ షాట్ నేను పెట్టింది కాదు. ఎవరో నన్ను ట్రోల్ చేయడానికి అలా ఎడిట్ చేశారు. 12 ఏళ్ల క్రితమే దీనిపై నేను మాట్లాడాను. ఇన్నాళ్లు మౌనంగా ఉండటానికి కొందరు నన్ను, నా ఫ్యామిలీని బెదిరించారు. నా ఫ్యామిలీ భద్రతని దృష్టిలో పెట్టుకుని నేను ఎక్కడా దీని గురించి మాట్లాడలేదు. నా కెరీర్ మొదలైందే తమిళనాడులో. అలాంటి రాష్ట్రంపై నేనేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తాను. ఆ ప్రచారం అవుతున్న వీడియోలో ఉన్నది నా మాటలు కావు.. అయినా సరే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ స్క్రీన్‌ షాట్‌ వల్ల బాధపడిన తమిళనాడు ప్రజలందరూ నన్ను క్షమించండి. అలాగే నా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘లాల్ సలాం’ చిత్రయూనిట్‌‌ని కూడా క్షమాపణలు కోరుతున్నాను. ఫైనల్‌గా నేను చెప్పేది ఏమిటంటే.. ఆ వీడియోలోని మాటలు నేను మాట్లాడలేదు అని నిరూపించుకోవడానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు.. అని ధన్య చెప్పుకొచ్చింది.


ఇవి కూడా చదవండి:

====================

*HanuMan: 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా రికార్డ్

****************************

*Family Star: ‘దేవర’ డేట్‌కే ఫిక్సయిన ‘ఫ్యామిలీ స్టార్’.. అయోమయంలో తారక్ ఫ్యాన్స్‌

*****************************

*Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై మంచు మోహన్ బాబు స్పందనిదే..

*************************

*Bubblegum: సుమ తనయుడి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

**************************

Updated Date - Feb 02 , 2024 | 08:18 PM