కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dhanush: సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త!

ABN, Publish Date - Jan 06 , 2024 | 03:38 PM

సోషల్‌ మీడియా ప్రతి ఒక్కరి సమయాన్ని వృథా చేసే దొంగ వంటిదని (థీఫ్ ఆఫ్‌ టైం), దాంతో జాగ్రత్తగా ఉండాలని హీరో ధనుష్‌ పిలుపునిచ్చారు. ధనుష్ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈనెల 12వ తేదీన సంక్రాంతిని పురస్కరించుకుని విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా గురించి ధనుష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hero Dhanush

సోషల్‌ మీడియా ప్రతి ఒక్కరి సమయాన్ని వృథా చేసే దొంగ వంటిదని (థీఫ్ ఆఫ్‌ టైం), దాంతో జాగ్రత్తగా ఉండాలని హీరో ధనుష్‌ (Dhanush) పిలుపునిచ్చారు. ధనుష్ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ఈనెల 12వ తేదీన సంక్రాంతిని పురస్కరించుకుని విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ధనుష్‌ మాట్లాడుతూ... ‘‘సోషల్‌ మీడియా మీకు తెలియకుండానే మీ సమయాన్ని వృథా చేస్తుంది. నలుగురు వ్యక్తులు ఒక చోట చేరినపుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం మంచిది. అంతేకానీ, మొబైళ్లు చూస్తూ మాట్లాడొద్దు. మున్ముందు ప్రతి ఒక్క విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగానే తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ప్రతిదాన్ని మితంగా ఉపయోగిస్తేనే ప్రతి ఒక్కరికీ మంచింది’ అన్నారు. సీనియర్‌ నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ (Vijayakanth) మృతికి ధనుష్‌ తనదైనశైలిలో సంతాపం తెలిపారు. విజయకాంత్‌ నటించిన ‘వైదేహి’ చిత్రంలోని ‘రాసావే ఉన్‌ కాణాద నెంజు’ అనే పాటను స్వయంగా గానం చేసి తన నివాళి అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. (Captain Miller Audio Launch)


దర్శకుడు అరుణ్‌ మాధేశ్వరన్‌ (Arun Matheswaran) మాట్లాడుతూ... గతంలో రెండు కథలు సిద్ధం చేసి ధనుష్‌ను డైరెక్ట్‌ చేసేందుకు ప్రయత్నించాను. అది సాధ్యపడలేదు. మూడోసారి ఈ అవకాశం వచ్చింది. ఈ స్టోరీ విన్న వెంటనే ఓకే చెప్పారు. నాకు ఈ ప్రాజెక్టు అప్పగించిన నిర్మాతకు ధన్యవాదాలు. ధనుష్‌ చిత్రం అనగానే కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ మరోమాట చెప్పకుండా ఓకే చెప్పేశారని అన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న నటుడు వినోద్‌ కృష్ణన్‌, హీరోయిన్లు ప్రియాంక అరుళ్‌ మోహన్‌, నివేదిత సతీష్‌, నటులు జయప్రకాష్‌, కాళి, ఎడ్వర్డ్‌, మాస్టర్‌ దిలీప్‌ సుబ్బరాయన్‌, దర్శకుడు మారి సెల్వరాజ్‌, నిర్మాత ధనుంజయన్‌, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌, నటుడు సందీప్‌ కిషన్‌, సత్యజ్యోతి ఫిలిమ్స్‌ అధినేత టీజీ త్యాగరాజన్‌ తదితరులు ప్రసంగించారు. కాగా, సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానరుపై తెరకెక్కించిన ఈ చిత్రంలో ధనుష్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, నివేదిత సతీష్‌, శివరాజ్‌ కుమార్‌, సందీప్‌ కిషన్‌ తదితరులు నటించారు.


ఇవి కూడా చదవండి:

====================

*RC16: ట్రెండింగ్‌లో రామ్ చరణ్ ‘RC16’.. ఎందుకో తెలుసా?

***************************

*Kannappa: ‘కన్నప్ప’తో ఆ డ్రీమ్ కూడా తీర్చేసుకుంటున్నారు..

**************************

*Dushara Vijayan: అంత పద్దతిగా ఉండే దుషార.. ఒక్కసారిగా దుమ్మురేపిందిగా..

*************************

*Eagle: మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు..

*************************

Updated Date - Jan 06 , 2024 | 03:38 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!