కెప్టెన్ నివాసానికి క్యూకడుతున్న సినీ ప్రముఖులు.. ఇప్పుడెందుకు వస్తున్నారంటూ..?
ABN, Publish Date - Jan 07 , 2024 | 02:15 PM
తమిళ చిత్రపరిశ్రమలో మానవతావాదిగా గుర్తింపుపొందిన సినీయర్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ గత నెల 28న అనారోగ్యం కారణంగా మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో వేళ్లపై లెక్కించదగిన సంఖ్యలోనే సినీ ప్రముఖులు పాల్గొన్నారు. విజయ్ వంటి అగ్రహీరో ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. చాలా మంది సెలబ్రిటీలు ఆయన చనిపోయినప్పుడు రాని వారు.. ఇప్పుడు సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారు.
తమిళ చిత్రపరిశ్రమలో మానవతావాదిగా గుర్తింపుపొందిన సినీయర్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ (Captain Vijayakanth) గత నెల 28న అనారోగ్యం కారణంగా మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో వేళ్లపై లెక్కించదగిన సంఖ్యలోనే సినీ ప్రముఖులు పాల్గొన్నారు. విజయ్ (Vijay) వంటి అగ్రహీరో ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. అయితే, కెప్టెన్ అంత్యక్రియల్లో సినీ ప్రముఖులు పాల్గొనలేదు. అలాగే, పలువురు చెన్నైలో ఉన్నప్పటికీ అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు. కానీ, ఇపుడు కోయంబేడులోని ఆయన సమాధి వద్దకు, సాలిగ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. ఇలాంటి వారిపై సినీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
మనిషి చనిపోయినపుడు వెళ్లి కడచూపు చూసి కుటుంబ సభ్యులను ఓదార్చాల్సిన నటీనటులు ఇపుడు సమాధి వద్దకు క్యూ కట్టడాన్ని తప్పుబడుతున్నారు. కెప్టెన్ సమాధి వద్దకు వెళ్ళిన వారిలో శరత్ కుమార్, శశికుమార్, శివకుమార్, సూర్య, కార్తీ, జయం రవి, అరుణ్ విజయ్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, నటి ఐశ్వర్య రాజేష్, దర్శక నటుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ ఇలా అనేక మంది ఉన్నారు. అప్పుడు రానివారు ఇప్పుడెందుకు వస్తున్నారంటూ.. కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా గరంగరం అవుతున్నారు. వాస్తవానికి అందరూ వచ్చేవాళ్లే. కానీ విజయకాంత్ మృతి విషయంలో కరోనా కూడా కారణం అనేలా వార్తలు రావడంతో అంతా వెనక్కి తగ్గారు. కాబట్టి.. ఈ విషయంలో సెలబ్రిటీలను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదంటూ.. ఇప్పుడు విజయకాంత్ సమాధికి నివాళులు అర్పిస్తున్న సెలబ్రిటీల అభిమానులు రియాక్ట్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Anjali: ముద్దుగా కనిపించినా.. నా పనులు అలా ఉంటాయి
***********************
*Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..
**************************
*RC16: ఆయనే.. అధికారికంగా ప్రకటించేశారు
***********************
*Nawazuddin Siddiqui: విక్టరీ వెంకటేష్ నుండి అందరూ అది నేర్చుకోవాలి
****************************