మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections: క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు

ABN, Publish Date - Apr 20 , 2024 | 03:30 PM

నిత్యం తళుకుబెళుకుల వెలుగుల మధ్య తళుక్కుమనే తారలు దిగివచ్చాయి. సాధారణ ప్రజలతో కలిసి, క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నాయి. తద్వారా సామాన్యులకు ఆదర్శంగా నిలబడడంతో పాటు ఓటు విలువను ప్రపంచానికి చాటిచెప్పాయి. సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు తమ తమ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నిత్యం తళుకుబెళుకుల వెలుగుల మధ్య తళుక్కుమనే తారలు దిగివచ్చాయి. సాధారణ ప్రజలతో కలిసి, క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నాయి. తద్వారా సామాన్యులకు ఆదర్శంగా నిలబడడంతో పాటు ఓటు విలువను ప్రపంచానికి చాటిచెప్పాయి. సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు తమ తమ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి దశ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ పోలింగ్‌లో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ (Rajinikanth), ఎంఎన్‌ఎం అధినేత.. హీరో కమల్‌ హాసన్‌ (Kamal Haasan), తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు.. అగ్రహీరో విజయ్‌ (Vijay), చియాన్‌ విక్రమ్‌ (Vikram), హీరో సూర్య (Suriya), కార్తీ, శివకుమార్‌, పార్తిబన్‌, విశాల్‌, హాస్య నటుడు యోగిబాబులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

యోగిబాబు వలసరవాక్కంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. హీరోలు సూర్య, కార్తీ, శివకుమార్‌లతో పాటు దర్శకుడు భారతీరాజా, ఆయన కుమారుడు మనోజ్‌ భారతీరాజా టి నగర్‌లోని హిందీ ప్రచార సభ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నటుడు జయం రవి, ఆయన సతీమణి ఆర్తి ఆళ్వార్‌పేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ స్కూల్‌లో, దర్శక నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ మడిప్పాక్కంలోని కింగ్స్‌ మెట్రిక్‌ స్కూల్‌లో, దర్శకుడు మారి సెల్వరాజ్‌ తిరునెల్వేలిలోను, స్టెల్లా మేరీస్‌ కాలేజీలో రజినీకాంత్‌, తే నాంపేటలోని తిరువళ్ళూవర్‌ వీధిలోని కార్పొరేషన్‌ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో కొందరు సెలబ్రిటీలు ఓటు వేశారు. (Voting for the Lok Sabha Elections 2024)


కీల్పాక్కంలోని చెన్నై స్కూల్‌లో నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), కొట్టూరుపురంలోని ఏఎంఎం స్కూల్‌లో వరలక్ష్మి, వలసరవాక్కంలోని దేవి అకాడెమీలో నాజర్‌ దంపతులు, టీటీకే రోడ్డులోని సెంట్‌ ఫ్రాన్సిసల్‌ జేవియర్‌ స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ధనుష్‌, నటి త్రిష ఓటు వేశారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ టి.నగర్‌లోని శారద హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో, అశోక్‌ నగర్‌లోని జవహర్‌ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో నటుడు రాఘవ లారెన్స్‌, నటుడు శివకుమార్‌ మదురైలో, కేకే నగర్‌ నిర్మలా స్కూల్‌లో దర్శక నటుడు పార్తిబన్‌ ఓటు వేశారు. అలాగే, మిగిలిన సినీ నటులు, దర్శక నిర్మాతలు, సహాయ నటీనటులు ఓటు వేసేందుకు పోటీ పడ్డారు.

Updated Date - Apr 20 , 2024 | 03:30 PM