Actress: శృంగార తార ఇంట్లో చోరీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్

ABN, Publish Date - Oct 06 , 2024 | 12:34 PM

శృంగార తార ఇంట్లో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరా శృంగార తార? ఏంటా కథ? అనుకుంటున్నారా? విషయంలోకి వస్తే

Actress Sona

శృంగార తార ఇంట్లో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరా శృంగార తార? ఏంటా కథ? అనుకుంటున్నారా? విషయంలోకి వస్తే నటి సోనా (Actress Sona) అందరికీ కాకపోయినా చాలా మందికి పరిచయమే. ఒకప్పుడు కోలీవుడ్‌లో శృంగార తారగా ఆమె పేరు మారు మోగింది. ఇప్పుడీ భామ ఇంట్లో చోరీ చేయడానికి ప్రయత్నం ఇద్దరు వ్యక్తం పోలీసులకు చిక్కారు. తమిళనాడు, మధురవాయల్‌ కృష్ణానగర్‌లో నటి సోనా నివసిస్తున్న ఇంట్లో గురువారం సాయంత్రం చొరబడి ఏసీని చోరీ చేసేందుకు ప్రయత్నించిన శివ, లోకేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read- Prakash Raj: డిప్యూటీ సీఎంకి ప్రకాష్ రాజ్ సపోర్ట్.. ఇంత ధైర్యమా?


ఆ ఇరువురు ఇంటి ప్రహరీ దూకి నటి సోనా ఇంట్లోకి చొరబడ్డారు. ఏదో సౌండ్ అయిందని చూసిన సోనాను చేత కత్తులు పట్టుకుని బెదిరించడంతో.. ఆమె కేకలు వేసింది. దీంతో వారిద్దరూ పారిపోయారు. ఈ సంఘటనపై మధురవాయల్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. సోనా ఫిర్యాదుతో ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలలో నమోదైన వీడియో దృశ్యాల ఆధారంగా పోలీసులు శివ, లోకేష్‌లను అరెస్టు చేసి, శనివారం కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు. వెంటనే రియాక్ట్ అయి.. దొంగలను పట్టుకున్న పోలీసులకు నటి సోనా థ్యాంక్స్ చెప్పారు.

Also Read- Rajendra Prasad: అప్పట్లో తన కుమార్తెతో మాటల్లేవని బాధపడ్డ రాజేంద్రప్రసాద్ ఈ శోకాన్ని ఎలా తట్టుకుంటాడో..


ఇక శృంగార తార అనే మాటకి వస్తే.. ఇలా పిలిపించుకోవడం తనకు ఇష్టంలేదని ఆ మధ్య సోనా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. దాదాపు 24 సంవత్సరాల సినీ కెరీర్ నాది. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా అలసిపోయాను. ఎన్నో సినిమాలు, మరెన్నో అవమానాలు నా వెంట నడిచాయి. ఒక్కోసారి ఆ అవమానాలను తట్టుకోలేక సినిమాలు కూడా మానేయాలని అనుకున్నాను. నాపై పడిన శృంగార తార అనే ముద్రని పోగొట్టుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను. అసలు ఎందుకు నన్ను శృంగార తారగా చూస్తున్నారో అని చెప్పి.. ఎంటైర్ నా సినీ జర్నీని ఒకసారి పరిశీలించి చూసుకున్నాను. పుట్టుకతో ఎవరూ చెడ్డవారు కాదు. వారు పెరిగే క్రమంలో పరిస్థితులు, ఎదురయ్యే సంఘటనలు, సమస్యల కారణంగానే జీవితాలు మలుపులు తిరుగుతుంటాయి. అలా అని వారిని చెడ్డగా చూడాల్సిన అవసరం లేదు. నా వరకు నేను ఆ పేరును తొలగించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.

Also Read- Rajendra Prasad: పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యం రాజేంద్రుడికి ఆ దేవుడు ఇవ్వాలి


Also Read- Pawan Kalyan: అప్పుడు తిట్టినా కేసు లేదు.. ఇప్పుడు ఒక్కమాటకే పోలీసు కేసు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2024 | 12:34 PM