మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Latest Update on Good Bad Ugly: అజిత్ సినిమా హైదరాబాదులో...

ABN, Publish Date - May 27 , 2024 | 05:18 PM

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హైదరాబాదులో వున్నారు. అతను తన రాబోయే సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రీకరణ కోసం హైదరాబాదులో వున్నారు. ఈ సినిమా కోసం ఒక స్టూడియోలో ప్రత్యేక సెట్ వేసినట్టుగా తెలుస్తోంది.

Still from Good Bad Ugly

తమిళ సూపర్ స్టార్ అజిత్ ప్రస్తుతం హైదరాబాదులో వున్నారు. ఇంతకీ అతను ఇక్కడ ఏమి చేస్తున్నారు అంటే తన తాజా సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా చిత్రీకరణ కోసం వచ్చారు అని తెలిసింది. ఈ సినిమాకి దర్శకుడు అధిక్ రవిచంద్రన్. అతను ఇంతకు ముందు 'మార్క్ ఆంటోనీ' అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు అజిత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రానికి అధిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ మూడు విభిన్న పాత్రలను పోషిస్తున్నట్టుగా ఈ చిత్రం మొదటి లుక్ ని విడుదల చేసినప్పుడు అర్థం అవుతోంది.

ఈ చిత్రం యొక్క మొదటి లుక్ ని ఈమధ్యనే విడుదల చేశారు. అందులో అజిత్ మూడు పాత్రల్లో ఎలా వుండబోతున్నారో తెలియబరిచారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మాణం చేస్తున్నారు. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక ప్రత్యేకమైన సెట్ తయారుచేశారని, అందులో అజిత్ తో చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ఇక్కడ ఇంకొన్ని రోజులు చిత్రీకరణ ఉంటుందని, తరువాత ఈ సినిమా రష్యాలో చిత్రీకరణ జరుపుకుంటుంది తెలిసింది.

వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం అజిత్ కి భారీ పారితోషికం ముట్టచెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమా సంగీతం సమకూర్చేందుకు దేవి శ్రీ ప్రసాద్ ని తీసుకున్నారు. ఇలా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది.

Updated Date - May 27 , 2024 | 05:40 PM