Aditi Shankar: అర్జున్‌ దాస్‌ సరసన అదితి శంకర్‌?

ABN, Publish Date - Jun 27 , 2024 | 09:58 PM

విలక్షణ నటుడు అర్జున్‌ దాస్‌ సరసన ప్రముఖ దర్శకుడు ఎస్‌.శంకర్‌ కుమార్తె అదితి కథానాయికగా నటించనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ వంటి చిత్రాల్లో ప్రతి నాయకుడిగా నటించి, ప్రేక్షకుల మనసులను గెలచుకున్న అర్జున్‌ దాస్‌... ‘అనీతి’, ‘రసవాది’ వంటి చిత్రాల్లో హీరోగా నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయనకు హీరోగా వరస అవకాశాలు వస్తున్నాయి.

Aditi Shankar and Arjun Das

విలక్షణ నటుడు అర్జున్‌ దాస్‌ (Arjun Das) సరసన ప్రముఖ దర్శకుడు ఎస్‌.శంకర్‌ కుమార్తె (S Shankar Daughter) అదితి శంకర్ (Aditi Shankar) కథానాయికగా నటించనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ వంటి చిత్రాల్లో ప్రతి నాయకుడిగా నటించి, ప్రేక్షకుల మనసులను గెలచుకున్న అర్జున్‌ దాస్‌... ‘అనీతి’, ‘రసవాది’ వంటి చిత్రాల్లో హీరోగా నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు. వైవిధ్య భరితమైన పాత్రలను ఎంచుకుంటూ తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్న అర్జున్‌ దాస్‌కు ఇపుడు హీరోగా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా, డెబ్యూ డైరెక్టర్‌ హాసిం అబ్దుల్‌ (Hesham Abdul Wahab) దర్శకత్వంలో నటించనున్నారు.

Also Read- Kalki 2898AD Review: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక నటించిన సినిమా ఎలా ఉందంటే...


గతంలో ‘గుడ్‌నైట్‌’, ‘లవర్‌’ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించిన మిలియన్‌ డాట్స్‌ సంస్థ నిర్మించనున్న చిత్రంలో అర్జున్‌ దాస్‌ సరసన హీరోయిన్‌గా పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు అదితి శంకర్‌ పేరును ఖరారు చేసినట్టు సినీ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. అదితి శంకర్‌ కూడా ఇప్పటికే తమిళ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆమె నటించిన ‘విరుమన్’, ‘మా వీరన్’ సినిమాలు మంచి విజయం సాధించాయి. తెలుగులోనూ అదితి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో ఆమె ఓ పాత్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Read Latest Cinema News

Updated Date - Jun 27 , 2024 | 09:58 PM