Radikaa: మా పరువు బజారుకీడ్చుతున్నారు.. ఆ యూట్యూబ్‌ చానెళ్ళను నియంత్రించండి

ABN, Publish Date - Aug 02 , 2024 | 09:20 AM

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అసత్య కథనాలు వండి వార్చుతున్న యూట్యూబ్‌ చానెళ్ళ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్‌ నటి, నిర్మాత రాధిక శ‌ర‌త్ కుమార్ కోరారు.

radhika

అనేక మంది సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అసత్య కథనాలు వండి వార్చుతున్న యూట్యూబ్‌ చానెళ్ళ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి, సినీ నటుడు ఉదయనిధికి సీనియర్‌ నటి, నిర్మాత రాధిక శ‌ర‌త్ కుమార్ (Radikaa Sarathkumar) కోరారు. ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా చొరవ తీసుకుని తమ పరువు బజారుకీడ్చుతున్న యూట్యూబ్‌ చానెల్స్‌ యజమానులపై పరువు నష్టం దావా వేయాలని ఆమె సూచించారు.

ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణును (Vishnu Manchu) చూసి గ‌ర్విస్తున్నాన‌ని, అత‌నిని త‌మిళ న‌టులు, సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలుగులో సుమారుగా 18 యూట్యూబ్‌ చానెళ్లపై చర్యలు తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు.


ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావస్తూ, ‘నడిగర్‌ సంఘం కూడా మేల్కోవాలి. జర్నలిస్టులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు చాలామంది సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అదేపనిగా అసత్య కథనాలను ప్రసారం చేస్తున్నారు. ఇలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి ఉదయనిధి (Udhayanidhi Stalin)తో పాటు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నూత‌న చ‌ట్టాలు తీసుకురావాల‌న్నారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ కూడా ఏకం కావాలి’ అని ఆమె కోరారు.

ఈ విష‌య‌మై న‌టి మీనా (Meena) స్పందిస్తూ రాధిక‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. ప్ర‌స్తుతం న‌టుల జీవితాల‌ను ప్ర‌భావితం చేసేలా యూట్యూబ్‌ చానెళ్ళ క‌థ‌నాలు ఉంటున్నాయ‌న్నారు. ఎలాంటి అధారాలు లేకుండా ప‌రిమితులు దాటి, చాలా అసంబ‌ద్ధంగా, వ‌ల్గ‌ర్‌గా వ్యూస్ కోసం త‌మ ఇష్టారితీన వార్త‌లు క్రియేట్ చేస్తున్నార‌ని ఇలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే అని త‌న అభిప్రాయాన్ని వెళ్ల‌డించింది.

Updated Date - Aug 02 , 2024 | 09:20 AM