Minmini: దృశ్యం పాప మెయిన్‌ లీడ్‌.. ‘మిన్మిని’ వ‌చ్చేస్తోంది

ABN, Publish Date - Jul 28 , 2024 | 12:09 PM

చిన్నారుల ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం ‘మిన్మిని’. గౌరవ్‌ కాలై , ఎస్తర్‌ అనిల్ ప్రధాన పాత్రలు పోషించగా, ఖతీజా రెహ్మాన్ సంగీతం అందించారు. వచ్చే నెలలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఇటీవ‌ల‌ విడుదల చేశారు.

minmini

చిన్నారుల ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం ‘మిన్మిని’. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దృష్టికి ఈ సినిమా వెళ్ళిందని దర్శకురాలు హలీదా షమీమ్ (Halitha Shameem) వెల్లడించారు. ఇందులో గౌరవ్‌ కాలై (Gaurav Kaalai), ప్రవీణ్‌ కిషోర్‌, ఎస్తర్‌ అనిల్ (Esther Anil) తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా, ఖతీజా రెహ్మాన్ (Khatija Rahman) సంగీతం అందించారు. వచ్చే నెలలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఇటీవ‌ల‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకురాలు హలీదా షమీమ్ (Halitha Shameem) మాట్లాడుతూ, ‘ఈ సినిమా చిన్న పిల్లల‌తో తీశాను. ఈ పాత్రలకు సంబంధించి రెండో పోర్షన్‌ వారితోనే తీయాలన్న పట్టుదలతో వారు పెరిగి పెద్దవారయ్యేంత వరకు వేచివుండి సినిమా పూర్తి చేశాను. ఈ విషయం దర్శకుడు శంకర్‌ దృష్టికి కూడా వెళ్ళింది. అనేక మంది ఆశ్చర్యంగా ఆరా తీశారు.

నిజం చెప్పాలంటే సినిమా షూటింగ్‌ ప్రారంభించేటపుడు కూడా ఇంతలా వెయిట్‌ చేయలేదు. కానీ, చిన్న పాత్రల్లో నటించిన వారే పెద్దయ్యాక కూడా నటించాలన్న ఉద్దేశంతో ఎదురు చూశామ‌న్నారు. అలాంటి సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంద‌న్నారు.


సంగీత దర్శకురాలు ఖతీజా రెహ్మాన్ (Khatija Rahman) మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం 2022లో దర్శకురాలు సంప్రదించారు. నా సంగీతం ఆమెకు నచ్చింది. అదేసమయంలో ఆమెకు ఏం కావాలన్న అంశంలో ఎంతో క్లారిటీగా ఉంటారు.

హలీదాతో కలిసి పనిచేసినందుకు ధన్యవాదాలు’ తెలిపారు. నటుడు గౌవర్‌ కాలై మాట్లాడుతూ, ‘హలీదాతో కలిసి పనిచేయడం వల్ల అనేక విషయాలు నేర్చుకున్నాను. ఇతర నటీనటులు కూడా ఎంతో శ్రద్ధతో నటించారు’ అని తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 12:09 PM