అర్ధ శతాబ్దంగా ఆయనొక్కరే కథానాయకుడు: హీరో
ABN, Publish Date - Dec 01 , 2024 | 09:38 AM
ఈ ఒక్క వేడుకలోనే కాదు 49 యేళ్ళుగా అన్ని వేడుకల్లో ఆయన హీరోగా ఉన్నారు. నేను చిత్రపరిశ్రమలోకి వచ్చిన కొత్తలో వెళ్ళని చోటు లేదు. ఆయన పాటలు ఒక తల్లిలా లాలిస్తాయి. ప్రతి కాలానికి ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ, ఎలాంటి ఆప్షన్ లేని ఒకే ఆప్షన్ ఆయన మాత్రమే అని అన్నారు యాక్టర్ సూరి. ఇంతకీ ఆయన ఎవరంటే..
అర్ధ శతాబ్ద కాలంగా ప్రతి ఒక్క వేడుకల్లోనూ కథానాయకుడిగా ఇసైజ్ఞాని ఇళయరాజా ఉంటున్నారని హీరో సూరి ప్రశంసించారు. ప్రేమ, పెళ్ళి ఇలా ఏ వేడుక జరిగినా ఆయన పాటలే వినిపిస్తాయని, అందుకే గత 49 యేళ్ళుగా ఆయన హీరోగా కొనసాగుతున్నారన్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, భవానీ శ్రీ, గౌతం వాసుదేవ్ మేనన్, రాజీవ్ మేనన్, బోస్ వెంకట్, బాలాజీ శక్తివేల్‌లు ప్రధాన పాత్రలు పోషించిన ‘విడుదలై-2’ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుక రీసెంట్‌గా చెన్నైలో జరిగింది.
Also Read-Rashmika Mandanna: దేనికైనా ఓ హద్దుంటుంది.. మితిమీరితే ఊరుకోను
ఈ కార్యక్రమంలో హీరో సూరి మాట్లాడుతూ.. ఈ ఒక్క వేడుకలోనే కాదు 49 యేళ్ళుగా అన్ని వేడుకల్లో ఇళయరాజా హీరోగా ఉన్నారు. నేను చిత్రపరిశ్రమలోకి వచ్చిన కొత్తలో వెళ్ళని చోటు లేదు. ఆయన పాటలు ఒక తల్లిలా లాలిస్తాయి. ప్రతి కాలానికి ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ, ఎలాంటి ఆప్షన్ లేని ఒకే ఆప్షన్ ఇళయరాజా మాత్రమే. ఆయనకు ప్రత్యామ్నాయం అనేది లేదు. ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు నాకు చెప్పారు. అవి జీవితకాలం గుర్తుండిపోతాయన్నారు.
హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. వెట్రి మారన్ ఒక అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా తొలి భాగంలోనే ఇది నిరూపణ అయింది. ఇపుడు రెండో భాగం మరింత అద్భుతంగా ఉంటుందన్నారు. దర్శకుడు వెట్రిమాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు స్టోరీ కంటే ఇళయరాజా సంగీతం మరింత బలాన్ని చేకూర్చింది. ఆయనతో కలిసి చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. విజయ్ సేతుపతి దగ్గర 8 రోజుల క్యాల్షీట్ అడిగి దాదాపు వంద రోజులకుపైగా వాడుకున్నాను. ఆయనకు ఈ సినిమాపై ఉన్న ప్రేమ అలా నడిపించిందని పేర్కొన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతూ.. తొలి భాగంలాగే, రెండో భాగం కూడా ఘన విజయం సాధిస్తుందన్నారు. నిర్మాత ఎల్‌రెడ్ కుమార్, భవానీ శ్రీ, రాజీవ్ మేనన్ తదితరులు ప్రసంగించారు.
Also Read- Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే..
Also Read-Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే
Also Read-Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్షజ్ఞ'
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి