Ramarajan: ఇప్పటికీ గుర్తున్నానంటే ఇళయరాజా పాటలే కారణం
ABN, Publish Date - Mar 31 , 2024 | 12:18 PM
రెండు దశాబ్దాలకు పైగా తన పేరు సినీ ప్రేక్షకుల్లో వినిపిస్తుందంటే దానికి కారణం ఇసైజ్ఞాని ఇళయరాజా పాటలేనని సీనియర్ నటుడు రామరాజన్ అన్నారు. మంచి కథా చిత్రాలను తెరకెక్కించే ఎట్‌సెట్రా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామరాజన్ హీరోగా నిర్మాత వి.మదియళగన్ ‘సామానియన్’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆర్. రాకేష్ దర్శకుడు. ఈ సినిమా ద్వారా రామరాజన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
రెండు దశాబ్దాలకు పైగా తన పేరు సినీ ప్రేక్షకుల్లో వినిపిస్తుందంటే దానికి కారణం ఇసైజ్ఞాని ఇళయరాజా (Ilaiyaraaja) పాటలేనని సీనియర్ నటుడు రామరాజన్ (Senior Actor Ramarajan) అన్నారు. మంచి కథా చిత్రాలను తెరకెక్కించే ఎట్‌సెట్రా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామరాజన్ హీరోగా నిర్మాత వి.మదియళగన్ ‘సామానియన్’ (Samaniyan) అనే చిత్రాన్ని నిర్మించారు. ఆర్. రాకేష్ దర్శకుడు. ఈ సినిమా ద్వారా రామరాజన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. రామరాజన్ సినీ ప్రయాణానికి ఇళయరాజా సంగీతం వెన్నెముక. ఈ చిత్రానికి కూడా ఇళయరాజా సంగీతం అందించారు. 23 యేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ చిత్రం వస్తోంది. హీరోయిన్లుగా నక్ష శరణ్, స్మృతి వెంకట్, అపర్ణతి నటించారు. ఇతర పాత్రల్లో రాధారవి, ఎంఎస్ భాస్కర్, లియో శివకుమార్, రాజారాణి పాండ్యన్, మైమ్ గోపి, బోస్ వెంకట్, వినోదిని తదితరులు నటించారు. ఎడిటింగ్ రామ్‌గోపి, సినిమాటోగ్రఫీ అరుళ్‌సెల్వన్. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను తాజాగా చెన్నైలో అనేక మంది అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. (Samaniyan Trailer and Audio Launch Event)
ఈ కార్యక్రమంలో హీరో రామరాజన్ మాట్లాడుతూ... 2010లో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. ఆ తర్వాత ఇలాంటి చిత్రంలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. నా అభిమానులు, రాష్ట్ర ప్రజల దీవెనలే నన్ను కాపాడాయి. ఈ సినిమా స్ర్కీన్‌ప్లే అద్భుతంగా ఉంది. ఈ సినిమాను చూసే మహిళలు, యువతే కాదు పురుషులు సైతం కన్నీరు పెట్టుకుంటారు. ఈ ఆడియో రిలీజ్‌కు ఇళయరాజా వస్తారని భావించాను. అనివార్య కారణాలతో రాలేకపోయారు. గత 23 యేళ్లుగా నన్ను రామరాజన్ అని పిలుస్తున్నారంటే దానికి కారణం ఇళయరాజా పాటలే. ఇప్పటికీ మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లోని పాటలు వింటున్నారు. 44 చిత్రాల్లో నటించిన నాకు 45వ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ సినిమా నన్ను సరైన మార్గంలో నడిపించిందని అన్నారు. (Senior Actor Ramarajan Speech at Samaniyan Audio Launch)
దర్శకుడు రాకేష్ (Rakesh) మాట్లాడుతూ.. 23 యేళ్ళ తర్వాత ఇళయరాజాను, మక్కల్ నాయకన్ రామరాజన్‌ను కలపడమే కాకుండా వారిద్దరితో కలిసి సినిమా తీసే భాగ్యం నాకు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే, ఈ ఆడియో రిలీజ్ వేడుకలో పాల్గొన్న దర్శకులు పేరరసు, ఆర్.వి. ఉదయకుమార్, కేఎస్ రవికుమార్, శరవణ సుబ్బయ్య, నటులు ఎంఎస్ భాస్కర్, లియో శివకుమార్, రోబో శంకర్, చిత్ర బృందం సభ్యులు ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Alaya F: ఈ ఆటను లాంగ్‌లైఫ్ కొనసాగించాలనుకుంటున్నా..
************************
*Family Star: విజయ్ ఈ సినిమాతో రౌడీ కాస్తా.. ‘ఫ్యామిలీ స్టార్’ అవుతాడు..
***********************