29న విడుదలయ్యే 9 చిత్రాల్లో ఆ రెండింటిపైనే అందరి దృష్టి
ABN, Publish Date - Nov 26 , 2024 | 08:21 PM
నవంబర్ చివరి శుక్రవారమైన 29వ తేదీ ఏకంగా తొమ్మిది చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాయి. అయితే వీటిలో విడుదల టైమ్‌కి ఎన్ని ఉంటాయనేది క్లారిటీ లేవు. కానీ ఈ 9 చిత్రాలలో రెండు చిత్రాలపై మాత్రం అందరి దృష్టి ఉంది. ఆ రెండు సినిమాలు ఏమేంటంటే..
నవంబర్ చివరి శుక్రవారమైన 29వ తేదీ ఏకంగా తొమ్మిది చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ నెల 22న ఐదుకుపైగా చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో అనేక చిత్రాలు విడుదలైంది తెలియను కూడా తెలియదు. థియేటర్ల నుంచి తీసివేసిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీ మరో 9 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ ఇది ఏ ఇండస్ట్రీలో అనుకుంటున్నారా? కోలీవుడ్ ఇండస్ట్రీలో. ఈ నెల 29వ తేదీన విడుదల అయ్యేందుకు 9 చిత్రాలు లైన్‌లో ఉన్నప్పటికీ.. ఆ సమయానికి తగినన్ని థియేటర్లు లభించక ఎన్ని చిత్రాలు వాయిదా పడతాయో చూడాల్సి ఉంది. (Kollywood Box Office)
Also Read- Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం
ఇప్పటివరకు వచ్చే శుక్రవారం విడుదలయ్యే చిత్రాల లిస్ట్ చూస్తే.. ‘అందనాల్’, ‘డబ్బాంకుత్తు’, ‘మాయన్’, ‘మిస్ యూ’, ‘సొర్గవాసల్’, ‘పరమన్’, ‘సైలెంట్’, ‘తిరుంబిపార్’, ‘సాదువన్’ మూవీలున్నాయి. వీటిలో ఒకప్పుడు లవర్‌బాయ్‌గా గుర్తింపు పొందిన సిద్ధార్థ్ (Siddharth) - ఆషికా రంగనాథ్ నటించిన ‘మిస్ యూ’ (Miss You), ఆర్జే బాలాజీ (RJ Balaji), సానియ అయ్యప్పన్ నటించిన ‘సొర్గవాసల్’ (Sorgavaasal) ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు మాత్రం ఎక్కువ థియేటర్లలో విడుదలకానున్నాయి.
కారణం, వీటిలో ఒక చిత్రాన్ని (మిస్ యూ) తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేస్తుండగా, ‘సొర్గవాసల్’ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ విడుదల చేస్తోంది. దీంతో ఈ రెండు చిత్రాలపై ఇటు సినీ వర్గాలు, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మిగిలిన చిత్రాలు ఏ మేరకు థియేటర్లను దక్కించుకుంటాయనేది మాత్రం.. ఇప్పుడప్పుడే చెప్పలేం. ఫైనల్‌గా ఈ శుక్రవారం ఎన్ని సినిమాలు థియేటర్లలోకి రానున్నాయనేది తెలియాలంటే మాత్రం రిలీజ్‌కు ముందు రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.