Friday Movies: నేడు తెరపైకి ఐదు చిత్రాలు
ABN, Publish Date - Oct 18 , 2024 | 12:52 PM
ఈ శుక్రవారం ఐదు చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ నెల 10వ తేదీ గురువారం సూపర్‌స్టార్ నటించిన ‘వేట్టయన్’ చిత్రం విడుదల కాగా, 11వ తేదీన జీవా నటించిన ‘బ్లాక్’ చిత్రం విడుదలై విజయం సాధించాయి. ఇక ఈ శుక్రవారం 5 చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వచ్చాయి. అవేంటంటే..
ఈ శుక్రవారం ఐదు చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ నెల 10వ తేదీ గురువారం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ (Vettaiyan) చిత్రం విడుదల కాగా, 11వ తేదీన జీవా నటించిన ‘బ్లాక్’ చిత్రం విడుదలై విజయం సాధించాయి. ‘వేట్టయన్’ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో చిన్న నిర్మాతలు తమ చిత్రాలను రిలీజ్ చేసేందుకు ఎవరూ సాహసం చేయలేదు. ఈ క్రమంలో మూడో శుక్రవారమైన నేడు ఐదు చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటిలో ‘ఆలన్’, ‘ఆర్యమాల’, ‘కరుప్పుపెట్టి’, ‘రాకెట్ డ్రైవర్’, ‘సార్’ వంటి చిత్రాలున్నాయి. వీటిలో ఏ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారో వేచి చూడాల్సివుంది.
Also Read- Ani Master: జానీ నిరపరాధి అని తేలితే ఏం చేస్తారు..
ఈ వారం తర్వాత దీపావళి పండుగను పురస్కరించుకుని, ఈ నెల 30వ తేదీన శివకార్తికేయన్ ‘అమరన్’, కవిన్ ‘బ్లడీ బెగ్గర్’, జయం రవి ‘బ్రదర్’తో పాటు మరికొన్ని సినిమాలు విడుదలకు క్యూలో ఉన్నాయి. వచ్చే నెలలో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం పదికిపైగా భాషల్లో విడుదలకానుంది. ఇక అక్టోబర్ 10న వచ్చిన సూపర్ స్టార్ ‘వేట్టయన్’ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఒక వైపు భారీ వర్షాలు పడుతున్నా.. తమిళ బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ హవా కొనసాగుతోంది. ‘జైలర్’ తర్వాత రజనీకాంత్ (Super Star Rajinikanth) చేసిన చిత్రం కావడంతో.. ఈ సినిమాపై విడుదలకు ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల రోజు మిక్స్‌డ్ టాక్ వినిపించినా.. రజనీ స్టార్ స్టామినా ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Also Read- Jai Hanuman: జై హనుమాన్‌లో హనుమంతుడు ఎవరంటే.. పాన్ ఇండియన్ స్టార్
ఇక సూపర్ స్టార్ సినిమాకు రెస్పెక్ట్ ఇచ్చి.. వాయిదా పడిన సినిమాలన్నీ నేడు కోలీవుడ్ బాక్సాఫీస్‌ని పలకరించాయి. ‘ఆలన్’, ‘ఆర్యమాల’, ‘కరుప్పుపెట్టి’, ‘రాకెట్ డ్రైవర్’, ‘సార్’ వంటి సినిమాలు ఈ శుక్రవారం విడుదలైనప్పటికీ.. ‘వేట్టయన్’ కలెక్షన్స్ మాత్రం స్టడీగానే ఉన్నట్లుగా కోలీవుడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరి ఈ 5 సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ని సొంతం చేసుకుంటుందో.. చూడాల్సి ఉంది.