Bloody Beggar: దీపావళి రేసులో కవిన్‌ ‘బ్లడీ బెగ్గర్‌’

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:55 PM

యువ హీరో కవిన్ నటించిన‌ తాజా చిత్రం ‘బ్లడీ బెగ్గర్‌’ను దీపావళికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.

kavin

యువ హీరో కవిన్ (Kavin) నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లడీ బెగ్గర్‌’(Bloody Beggar)ను దీపావళికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. దీపావళి పండుగకు రాజ్‌కమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో శివకార్తికేయన్‌ హీరోగా రూపొందిన ‘అమరన్‌’ చిత్రం విడుదలకానుంది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో శివకార్తికేయన్‌ ఆర్మీ అధికారికగా నటించారు. ఈ సినిమాను అక్టోబరు 31వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో కవిన్‌ హీరోగా రూపొందుతున్న ‘బ్లడీ బెగ్గర్‌’ (Bloody Beggar)కూడా 31నే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్ (Nelson Dilipkumar) నిర్మాతగా డెబ్యూ డైరెక్టర్‌ శివబాలన్‌ ముత్తుకుమార్ (Sivabalan Muthukumar ) దర్శకత్వం వహించారు. కథ బలంగా ఉండటంతో ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకంతో చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 12:55 PM