Ajith: మరో లగ్జరీ కారు కొన్న అజిత్‌.. ఖ‌రీదు ఎంతంటే!

ABN, Publish Date - Sep 17 , 2024 | 08:24 AM

కోలీవుడ్‌ అగ్రహీరో అజిత్‌ మరో లగ్జరీ కారు కొనుగోలు చేశారు. మోటార్ బైక్స్ అన్నా, రేసింగ్ అన్నా తెగ ఇష్ట‌ప‌డే అజిత్ తాజాగా ఫోర్స్‌ జీటీ3 ఆర్‌ఎస్‌ మోడల్‌ రేస్‌ కారును కొనుగోలు చేశారు.

ajith

ఇటీవ‌లే త‌మిళ న‌టుడు విజ‌య్ రూ.3 కోట్ల విలువైన కారును కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అవదే బాట‌లో కోలీవుడ్‌ అగ్రహీరో అజిత్‌ మరో లగ్జరీ కారు కొనుగోలు చేశారు. మోటార్ బైక్స్ అన్నా, రేసింగ్ అన్నా తెగ ఇష్ట‌ప‌డే అజిత్ త‌రుచూ ఆ పోటీల్లోనూ పాల్గొంటూ ఉంటారు. అయితే ఇప్ప‌టికే ఫెరారీతో స‌హా ఓ మూడు ఖ‌రీదైన కార్లు ఆయ‌న ద‌గ్గ‌ర ఉండ‌గా తాజాగా ఫోర్స్‌ జీటీ3 ఆర్‌ఎస్‌ మోడల్‌ (Porsche 992 GT3RS) రేస్‌ కారును ఆయన కొనుగోలు చేయ‌డం విశేషం.

ఈ లగ్జరీ కారు ధర రూ.4 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ కారు క్షణాల్లో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ విషయాన్ని ఆయన సతీమణి షాలిని (shalini) తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడిస్తూ, కారు ఫొటోలను కూడా షేర్‌ చేశారు. ఈ ఫొటోలను అజిత్ (AjithKumar) అభిమానులు షేర్‌ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా ప్రస్తుతం అజిత్ (Ajith Kumar) రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విడాముయర్చి’ (VidaaMuyarchi) ఈ దీపావళికి విడుదలకానుండగా, ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కే ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది.

Updated Date - Sep 17 , 2024 | 08:24 AM