రాజకీయ నేతల అరాచకాలను ఎదిరించే ‘సేవకర్‌’

ABN, Publish Date - Oct 27 , 2024 | 12:52 PM

ఇటీవ‌ల త‌మిళాన‌ట థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన సేవ‌క‌ర్ చిత్రం మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంటోంది. తన ఊరివారికి, సమాజానికి మంచి చేయాలని పరితపించే ఒక యువకుడు.. తన దారికి అడ్డొచ్చే రాజకీయ నేతల అరాచకాలకు ఎదురునిలబడి వారిని అంతం చేసే చిత్రంగా ‘సేవకర్‌’ను రూపొందించారు.

sevakar

ఇటీవ‌ల త‌మిళాన‌ట థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన సేవ‌క‌ర్ (Sevakar) చిత్రం మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంటోంది. తన ఊరివారికి, సమాజానికి మంచి చేయాలని పరితపించే ఒక యువకుడు.. తన దారికి అడ్డొచ్చే రాజకీయ నేతల అరాచకాలకు ఎదురునిలబడి వారిని అంతం చేసే చిత్రంగా ‘సేవకర్‌’ను రూపొందించారు. ప్రజిన్ (prajin), షకానా హీరోహీరోయిన్లుగా నటించగా, సీనియర్‌ నటుడు బోస్‌ వెంకట్ (Bose Venkat) పోలీస్‌ అధికారిగా, ఆడుగళం నరేన్‌ రాజకీయ నేతగా నటించారు. ఇతర పాత్రల్లో రాజేష్‌, హీమా, శంకరి, రూప, సునీల్‌, బాలు, షాజీ కృష్ణ, సాయి శంకర్‌, జిష్ణు జిత్‌ తదితరులు నటించారు. సంతోష్‌ గోపినాథ్‌ కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. సంగీతం ఆర్‌డీ మోహన్‌, కెమెరా ప్రదీప్‌ నాయర్‌. సిల్వర్‌ మూవీస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రాజన్‌ జోసెఫ్‌ థామస్‌ నిర్మించారు.

వివరాలను దర్శకుడు వివరిస్తూ, ‘సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే యువకుడి పాత్రలో ప్రజిన్‌ నటించగా, అతనికి అండగా నలుగురు స్నేహితులు నిలబడుతారు. వీరంతా కలిసి తమ ఊరికి మంచి చేస్తుంటారు. దీంతో రాజకీయ నేతలను ప్రజలు పట్టించుకోవడం మానేస్తారు. దీన్ని జీర్ణించుకోలేని రాజకీయ నేతలు జైలులో ఉండే ముగ్గురు రౌడీలను తీసుకొచ్చి ఊరిలో హింసాత్మక చర్యలకు ఉసిగొల్పుతారు. వీరికి కొందరు పోలీసులు వత్తాసు పలుకుతారు. ఈ విషయం తెలుసుకున్న హీరో, తన నలుగురు స్నేహితులతో కలిసి రాజకీయ నాయకులపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తాడు. వీరికి సమాజంపై ఉన్నత భావాలు కలిగిన ఒక మంచి పోలీస్‌ ఉన్నతాధికారి బోస్‌ వెంకట్‌ తనవంతు సాయం చేస్తారు. చివకు ప్రజాసేవకు అడ్డంకిగా ఉండే రాజకీయ నేతలను హీరో ఎలా అణిచివేశాడన్నదే ఈ చిత్ర కథ. ఇందులో ఉన్న పాటలకు ఇప్పటికే మంచి ఆదరణ లభించాయి’ అని పేర్కొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:52 PM