8 వారాల తర్వాతే.. ఓటీటీలకు కొత్త సినిమాలు ఇవ్వాలి
ABN, Publish Date - Jul 31 , 2024 | 09:56 AM
ఇకపై స్టార్ హీరోలు నటించిన చిత్రాలను ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీల్లో ప్రసారం చేసేందుకు ఇవ్వాలని తమిళ నిర్మాతల మండలి అధ్యక్షతన జరిగిన వివిధ సంఘాల నిర్వాహకులు ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేశారు.
స్టార్ హీరోల చిత్రాలను ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీల్లో ప్రసారం చేసేందుకు ఇవ్వాలని తమిళ నిర్మాతల మండలి (Tamil Film Producers Council ) అధ్యక్షతన జరిగిన వివిధ సంఘాల నిర్వాహకులు ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేశారు.
సోమవారం తమిళ సినీ నిర్మాతల మండలి. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం, తమిళనాడు థియేటర్, మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్, తమిళనాడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ తదితర సంఘాల నిర్వాహకులు, ప్రతినిధులు పాల్గొని, కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఇందులో భాగంగా స్టార్ హీరోలు నటించే కొత్త చిత్రాలను ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక సినిమాకు ముందస్తుగా అడ్వాన్స్ రూపంలో నిర్మాతల నుంచి డబ్బు తీసుకునే నటీనటులు.. ఆ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాతే కొత్త చిత్రానికి ఒప్పందం చేసుకోవాలని తీర్మానించారు. చిత్ర పరిశ్రమలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటిని ఏర్పాటుచేయాలని ఇందులో నిర్ణయించారు.