Suriya: 'డబుల్' స్పీడ్‌లో సూర్య

ABN, Publish Date - Oct 08 , 2024 | 11:07 AM

ఈ సినిమాతో పాటు మరో స్టార్ డైరెక్టర్‌తో సూర్య చేస్తున్న ప్రాజెక్ట్‌పై ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమాని సూర్య జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేస్తున్నాడట. దీంతో పాటు కంగువ సినిమాలో సూర్య రోల్‌పై ఆసక్తికర అప్డేట్ రావడంతో ఆయన ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..

kanguva poster

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ఎప్పుడు నిర్మాతల ఫెవరెట్‌గా నిలుస్తాడు. మంచి కథల ఎంపికతో పాటు చకచకా సినిమాలు పూర్తి చేయడం సూర్యకి మాత్రమే సాధ్యం. ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కంగువ(Kanguva)తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాతో పాటు మరో స్టార్ డైరెక్టర్‌తో సూర్య చేస్తున్న ప్రాజెక్ట్ పై ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమాని సూర్య జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేస్తున్నాడట. దీంతో పాటు కంగువ సినిమాలో సూర్య రోల్‌పై ఆసక్తికర అప్డేట్ రావడంతో ఆయన ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..


జిగర్తాండ సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులల్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. పిజ్జా, పెట్టా, నవరస, మహాన్ చిత్రాలతో తన మార్క్ డైరెక్షన్‌తో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఈయన సూర్య 44వ మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అయితే అతికొద్ది సమయంలోనే ఈ మూవీ షూట్ కంప్లీట్ కావడం విశేషం. దీంతో పాటు 'కంగువ'లో సూర్య రెండు విలక్షణమైన రోల్స్‌లో కనిపించబోతున్నాడని టాక్. యాక్షన్ పాత్రల్లో తనదైన మార్క్ వేసిన సూర్య.. రెండు రోల్స్ చేయనుండటంతో ఫ్యాన్స్ ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి.


దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సినిమాను భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. దిశా పటానీ (Disha Patani) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో బాబీ డియోల్ (Bobby Deol) కీ రోల్ ప్లే చేస్తున్నారు. మరోవైపు సూర్య 44కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ బాణీలు అందిస్తున్నాడు.

Updated Date - Oct 08 , 2024 | 11:07 AM