Kanguva: నవంబరులో ‘కంగువా’! ర‌జ‌నీకాంత్ కోసం సూర్య త్యాగం

ABN, Publish Date - Sep 17 , 2024 | 06:44 AM

హీరో సూర్య, దర్శకుడు చిరుత్తై శివ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన‌‘కంగువా’ చిత్రాన్ని అక్టోబరు 10న విడుదల చేయాలని తొలుత నిర్ణయించినా ఇప్పుడు వాయిదా వేసేందుకు మేక‌ర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

kanguva

హీరో సూర్య (Suriya), దర్శకుడు చిరుత్తై శివ (Siva) కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ తన సొంత నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ బ్యానరుపై నిర్మించిన ‘కంగువా’ (Kanguva) చిత్రాన్ని నవంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సహా హిందీతో పాటు దాదాపు పదికి పైగా భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇప్పటికే అన్ని రకాల నిర్మాణ పనులను పూర్తి చేసుకుంది. దీంతో దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబరు 10న విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే, అదేరోజున సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయన్‌’ (Vettaiyan) విడుదల కానుంది. దీంతో ‘కంగువా’ (Kanguva) చిత్రం విడుదలను వాయిదా వేశారు. ఇపుడు సరైన తేదీ కోసం చిత్ర బృందం అన్వేషిస్తోంది.

ఇందులో భాగంగా, నవంబరు 14న సరైన తేదీగా భావిస్తున్నారు. అయితే, ఈ తేదీని అన్ని భాషల పంపిణీదారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు ఈ తేదీపై ఎలాంటి అభ్యంతరం లేకుంటే అదే రోజున ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సెన్సార్‌ కార్యక్రమాలను కూడా ముందుగానే పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

Updated Date - Sep 17 , 2024 | 06:44 AM