Suriya: ఆ లోన్‌ తీర్చడానికే ఇండస్ట్రీలోకి వచ్చా

ABN, Publish Date - Oct 24 , 2024 | 04:55 PM

తమిళ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్‌ ఉంది. ఆయన ప్రతి చిత్రం తెలుగులో విడుదలవుతుంది. ఇక్కడ కూడా ఆయనకు ఫ్యాన్‌ బేస్‌ ఎక్కువే. ఆయన సినిమా వస్తుందంటే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సందడి ఉంటుంది. అయితే సూర్య సినిమా ఇండస్ట్రీ కి రావడానికి గల కారణాన్ని తెలియచేశారు.

తమిళ హీరో సూర్యకు (Suriya) తెలుగులో కూడా మంచి మార్కెట్‌ ఉంది. ఆయన ప్రతి చిత్రం తెలుగులో విడుదలవుతుంది. ఇక్కడ కూడా ఆయనకు ఫ్యాన్‌ బేస్‌ ఎక్కువే. ఆయన సినిమా వస్తుందంటే కోలీవుడ్‌తో (kollywood) పాటు టాలీవుడ్‌లోనూ సందడి ఉంటుంది. అయితే సూర్య సినిమా ఇండస్ట్రీ కి రావడానికి గల కారణాన్ని తెలియచేశారు.



‘‘చదువు పూర్తికాగానే ఓ గార్మెంట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. మొదట 15 రోజులకు రూ.750 ఇచ్చారు. మూడు సంవత్సరాల తర్వాత నెలకు రూ.8000 చేశారు. ఏదో ఒకరోజు సొంతంగా కంపెనీ పెట్టాలనుకున్నా. ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సమయంలో మా నాన్నకు తెలియకుండా అమ్మ బ్యాంక్‌లో రూ.25వేలు లోన్‌ తీసుకున్నట్లు నాతో చెప్పింది. ఆలోన్‌ తీర్చడం కోసమే మణిరత్నం సినిమాలో అవకాశం రాగానే అంగీకరించా. నేను చిత్ర పరిశ్రమలోకి రావాలని, నటుడిగా ఎదగాలని కలలో కూడా అనుకోలేదు. మా అమ్మకు రూ.25 వేలు ఇచ్చేసి.. ‘మీ లోన్‌ అయిపోయింది. ఇక బాధపడొద్దు’ అని చెప్పేద్దామనుకున్నా.. దాని కోసం నా కెరీర్‌ ప్రారంభించా. ఇప్పుడు సూర్యగా ఇంత మంది అభిమానులను సొంతం చేసుకున్నా’’ అని సూర్య చెప్పారు. 1997లో విడుదలైన 'ఓ నెర్రుక్కు నెర్‌' అనే తమిళ సినిమా ద్వారా సూర్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వసంత్‌ దర్శకత్వం వహించిన ఆ సినిమాను మణిరత్నం నిర్మించారు. ఇందులో విజయ్‌ హీరోగా నటించగా సూర్య  మరో పాత్రలో కనిపించారు. ఆ తర్వాత  సూర్య వరుస అవకాశాలు అందుకొని స్టార్‌గా ఎదిగారు.

ప్రస్తుతం ఆయన నటించిన ‘కంగువా’ (Kanguva) విడుదలకు సిద్థంగా ఉంది. శివ (Siva) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సూర్య హైదరాబాద్‌లో ఉన్నారు. కంగువా ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు. అందులో భాగంగా గురువారం ఉదయం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌4’ షోలో పాల్గొన్నారు. ఆయనతోపాటు ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాబీ దేవోల్‌ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 05:03 PM