Suriya - Jyothika: మీ భర్తను నాకు ఇస్తారా?
ABN, Publish Date - Mar 21 , 2024 | 09:41 PM
"తమిళ స్టార్ సూర్య(Suriya), జ్యోతిక (jyothika)మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరి మధ్య దూరం పెరిగి, ఇద్దరూ విడిపోయారు'’ అంటూ ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న మాట ఇది. అలా జరిగిన ప్రతిసారి అది తప్పని నిరూపిస్తూనే ఉన్నారు సూర్య దంపతులు
"తమిళ స్టార్ సూర్య(Suriya), జ్యోతిక (jyothika)మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరి మధ్య దూరం పెరిగి, ఇద్దరూ విడిపోయారు'’ అంటూ ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న మాట ఇది. అలా జరిగిన ప్రతిసారి అది తప్పని నిరూపిస్తూనే ఉన్నారు సూర్య దంపతులు. కొంతకాలం క్రితం వీరు విడాకులు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరగ్గా జంటగా వెకేషన్లో కనిపించి అందరి నోళ్లు మూయించారు. సూర్యతో పెళ్లయిన పదేళ్లు సూర్యను పెళ్లి చేసుకున్నాక దాదాపు పదేళ్లపాటు నటనకు దూరమైన జ్యోతిక కొన్నాళ్లకు మళ్లీ మేకప్ వేసుకోవడం మొదలుపెట్టారు. కథా బలమున్న పాత్రలు, వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నారు. తాజాగా 'షైతాన్' మూవీలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల పైగా రాబట్టింది. ఈ సినిమా గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయింది.
‘కొన్ని సినిమాలు కేవలం గమ్యస్థానానికే తీసుకెళ్తాయి. కానీ షైతాన్ అనేది ఒక అందమైన, సంతోషకరమైన, ఎన్నో జ్ఞాపకాలు రంగరించిన అద్భుత ప్రయాణం. ఈ జర్నీలో ఎంతోమంది స్నేహితులు దొరికారు. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసిన దేవ్‌గణ్ ఫిలింస్, పనోరమ స్టూడియోస్, జియో స్టూడియోస్ నిర్మాణ సంస్థలకు కృతజ్ఞతలు. టీమ్ మొత్తానికి అభినందనలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది.ఇందులో షైతాన్ టీమ్‌తో పాటు హీరో సూర్యతో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. ఇది చూసిన ఓ అభిమాని.. ‘జ్యోతిక మేడమ్.. సిల్లును ఒరు కాదల్ సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? 15 ఏళ్లుగా ఆ జెంటిల్మెన్కు పెద్ద అభిమానిని’ అని కామెంట్ చేసింది. దీనికి జ్యోతిక.. ‘అలాంటివేమీ కుదరదమ్మా..’ అని రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై చూసి అభిమాని ఎగిరి గంతేసింది. ‘నేను సూర్యకు ఎంత పెద్ద అభిమానినో మీరు అసలు ఊహించి ఉండరు. నా పేరులో కూడా అతడి పేరును యాడ్ చేశాను. ఆయనే నా ఫస్ట్ లవ్.. నేను ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఈ విషయం ఆయనకు చెప్పండి. అయినా మీరు పంచే ప్రేమ ముందు నాదెంత’’ అని రాసుకొచ్చింది.