విలంగు ఫేం ప్రశాంత్‌ పాండ్యరాజ్‌ దర్శకత్వంలో.. సూరి కొత్త చిత్రం

ABN, Publish Date - Aug 23 , 2024 | 09:52 AM

నటుడు సూరి వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయారు. ‘విడుదలై’, ‘గరుడన్‌’చిత్రాలతో వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న సూరి.. ఇప్నుడు ‘విలంగు’వెబ్‌ సిరీస్‌ ఫేం ప్రశాంత్‌ పాండ్యరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు.

soori

నటుడు సూరి (Suri) వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయారు. ‘విడుదలై’, ‘గరుడన్‌’(Karudan) చిత్రాలతో వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న సూరి.. ఇప్నుడు ‘విలంగు’(Vilangu) వెబ్‌ సిరీస్‌ ఫేం ప్రశాంత్‌ పాండ్యరాజ్ (Prashanth Pandyaraj) దర్శకత్వంలో నటించనున్నారు. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.

2017లో జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా ‘బ్రూస్‌ లీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్‌కు సరైన ఆదరణ లభించలేదు. అయితే, విమల్‌ ప్రధాన పాత్రలో ‘విలంగు’ (Vilangu) పేరుతో రూపొందించిన వెబ్‌ సిరీ్‌సకు అనూహ్య స్పందనతో పాటు ఆదరణ లభించింది. దీంతో ఇండస్ట్రీలో ప్రశాంత్‌ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.


ఇపుడు సూరి హీరోగా కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. లార్క్‌ స్టూడియోస్ (Lark Studios) పతాకంపై కె.కుమార్ (K. Kumar) ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో నటిం చే నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Updated Date - Aug 23 , 2024 | 09:52 AM