Sun Pictures: నాడు మామ‌కు BMW.. నేడు అల్లుడికి చెక్కులు

ABN, Publish Date - Aug 25 , 2024 | 11:04 AM

స్టార్ హీరో ధ‌నుష్ న‌టిస్తూ ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘రాయన్‌’. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి రూ. 150 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. దీన్ని పురస్కరించుకుని ఆ చిత్ర నిర్మాత కళానిధి మారన్ హీరో, దర్శకుడు ధనుష్‌కు రెండు చెక్కులను బహూకరించారు.

dhanush

స్టార్ హీరో ధ‌నుష్ (Dhanush) న‌టిస్తూ ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘రాయన్‌’ (Raayan). ధనుష్‌ హీరో నటించిన 50వ చిత్రమిది. సన్‌ పిక్చర్స్ (Sun Pictures) పతాకంపై కళానిధి మారన్ (Kalanithi Maran) ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 26న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి రూ. 150 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. దీన్ని పురస్కరించుకుని ఆ చిత్ర నిర్మాత కళానిధి మారన్ (Kalanithi Maran) హీరో, దర్శకుడు ధనుష్‌కు రెండు చెక్కులను బహూకరించారు. ఈ చెక్కుల్లో ఎంత మొత్తం రాశారన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు.

అయితే గ‌తంలో ర‌జ‌నీకాంత్‌తో స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించిన జైల‌ర్ సినిమా ఇలానే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌గా అప్పుడు కూడా నిర్మాత క‌ళానిధి మార‌న్ ఈ సినిమాలో న‌టించిన ర‌జ‌నీకాంత్‌కు రూ.1.26 కోట్ల విలువైన‌ బీఎండబ్ల్యూ ఎక్స్‌7 మోడల్ కారును, ద‌ర్శ‌కుడు నెల్స‌న్, సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్‌ల‌కు చెరో పోర్స్చే (Porsche) కారు బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం విశేషం.


ఎస్‌జే సూర్య (S. J. Suryah), దుషార విజయన్ (Dushara Vijayan), సందీప్‌ కిషన్ (Sundeep Kishan), కాళిదాస్‌ జయరాం (Kalidas Jayaram), అప‌ర్ణ బాల‌ముర‌ళి (Aparna Balamurali), ప్రకాష్‌ రాజ్‌, సెల్వరాఘవన్‌ తదితరులు నటించారు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ (A. R. Rahman) సంగీతం. ఈ చిత్రం జూలై 26న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిర్మాత కళానిధి హీరోను కలిసి రెండు చెక్కులను బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని సన్‌ పిక్చర్స్ (Sun Pictures) తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో వెల్లడించింది. కాగా, ఈ సినిమా ప్ర‌స్తుతం అమెజాన్ (Amazon Prime Video) ఓటీటీలో టెలికాస్ట్ అవుతుంది.

Updated Date - Aug 25 , 2024 | 11:04 AM