Andrea Jeremiah: ఫ్లీజ్.. జస్టిస్ హేమ కమిషన్‌పై నన్ను ప్రశ్నలు అడగొద్దు
ABN, Publish Date - Sep 04 , 2024 | 12:16 PM
ఫ్లీజ్.. మలయాళ చిత్రపరిశ్రమలో అవకాశాల పేరుతో ‘అడ్జెస్ట్మెంట్’పై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదికపై తనను ప్రశ్నించవద్దంటూ సింగర్, హీరోయిన్ ఆండ్రియా జెర్మయ్య స్పష్టంచేశారు.
మలయాళ చిత్రపరిశ్రమలో అవకాశాల పేరుతో ‘అడ్జెస్ట్మెంట్’పై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదికపై తనను ప్రశ్నించవద్దంటూ సింగర్, హీరోయిన్ ఆండ్రియా జెర్మయ్య (Andrea Jeremiah) స్పష్టంచేశారు. తిరువాన్మియూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెను మీడియా జస్టిస్ హేమ కమిషన్‌పై ప్రశ్నలు సంధించింది.
దీనికి ఆండ్రియా జెర్మయ్య (Andrea Jeremiah) సమాధానమిస్తూ, చిత్రపరిశ్రమలో మహిళల లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదికపై నో కామెంట్స్, ఈ అంశంలో ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు’ అంటూ కోరారు. నిజానికి ప్రతి అంశంలో ఎంతో బోల్డ్‌గా స్పందించే నటి ఆండ్రియా.. జస్టిస్ హేమ కమిషన్‌పై మాట్లాడేందుకు నిరాకరించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.