Aishwarya Rajesh: ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ కనబడలేదు..హేమ కమిటీ అక్కర్లేదు
ABN, Publish Date - Sep 18 , 2024 | 04:31 PM
తమిళ చిత్రసీమలో ఎన్నడు కూడా హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురైన సందర్భాలు ఎక్కడా కనిపించలేదని అందువల్ల మలయాళ చిత్రపరిశ్రమలో ఏర్పాటు చేసినట్టుగా జస్టిస్ హేమ కమిషన్ ఇక్కడ అక్కర్లేదని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అభిప్రాయ పడ్డారు.
తమిళ చిత్రసీమలో ఎన్నడు కూడా హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురైన సందర్భాలు ఎక్కడా కనిపించలేదని అందువల్ల మలయాళ చిత్రపరిశ్రమలో ఏర్పాటు చేసినట్టుగా జస్టిస్ హేమ కమిషన్ ఇక్కడ అక్కర్లేదని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) అభిప్రాయ పడ్డారు.
చెన్నైలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంశాలు ఎక్కడా చోటు చేసుకోలేదు. ఈ విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషా చిత్రాల్లో నేను నటించాను. నేను ఏనాడు కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోలేదని అన్నారు.
అందువల్ల జస్టిస్ హేమ కమిషన్ (Hema Committee report) ఇక్కడ అక్కర్లేదన్నది నా వ్యక్తిగత భావన అని. తమిళ చిత్రపరిశ్రమ సాఫీగా సాగిపోతుంది. మహిళల భద్రత చాలా ముఖ్యం. ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి’ అని పేర్కొన్నారు.