S. J. Suryah: నా మెంటర్‌.. హీరో అజిత్

ABN, Publish Date - Aug 18 , 2024 | 06:28 PM

హీరో అజిత్ కుమార్ నా మెంటర్‌ అని దర్శక నటుడు ఎస్‌జే సూర్య చెప్పుకొచ్చారు. చాలాకాలం తర్వాత అజిత్‌తో కలిసి పనిచేయడం చిరస్మరణీయ జ్ఞాపకాల్లో ఒకటిగా మిగిలిపోతుందన్నారు.

sj suryah

అగ్రహీరో అజిత్ (Ajith Kumar) తన మెంటర్‌ అని దర్శక నటు డు ఎస్‌జే సూర్య (S. J. Suryah) చెప్పుకొచ్చారు. చాలాకాలం తర్వాత అజిత్‌తో కలిసి పనిచేయడం చిరస్మరణీయ జ్ఞాపకాల్లో ఒకటిగా మిగిలిపోతుందన్నారు. ఆధిక్‌ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వంలో అజిత్‌ హీరోగా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly)పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఆరేప్సీలో శరవేగంగా జరుపుకుంటోంది. పూర్తిస్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్నట్టు సమాచారం. ఇందులో దర్శక నటుడు ఎస్‌జే సూర్య (S. J. Suryah) ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.


ఇదిలాఉండగా అజిత్‌ హీరోగా ఎస్‌జే సూర్య దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం ‘వాలి’ (Vaali) సినిమా వచ్చింది. అజిత్‌ (Ajith Kumar)ద్విపాత్రాభినయం చేయగా, మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇపుడు ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly) కోసం కలిశారు.

దీనిపై ఎస్‌జే సూర్య (S. J. Suryah) స్పందిస్తూ, ‘చాలా సంవత్సరాల తర్వాత నా జీవితంలో అత్యంత ఆనందకర క్షణాలు. అజిత్‌ కుమార్‌ (Ajith Kumar) నా మెంటర్‌. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ, అజిత్‌తో కలిసి తాను దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

Updated Date - Aug 18 , 2024 | 06:28 PM