Ayalaan Trailer: ఎలియన్స్ ప్రతీ సారి అమెరికాకే వెళ్తాయి కదా.. ఇప్పుడు మన దేశానికి వచ్చాయేంట్రా
ABN, Publish Date - Jan 05 , 2024 | 09:18 PM
శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం అయలాన్. అదే పేరుతో తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) రాత్రి అయలాన్ తెలుగు ట్రైలర్‌ను శివకార్తికేయన్ తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా విడుదల చేశారు.
మహావీరుడు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం తర్వాత తమిళ స్టార్ నటుడు శివకార్తికేయన్ (Siva Karthikeyan), రకుల్ ప్రీత్ (Rakulpreet) సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం అయలాన్. అదే పేరుతో తెలుగులోకి తీసుకువస్తున్నారు. సంక్రాంత్రి పండుగ రోజు విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం తెలుగు ట్రైలర్ (Ayalaan Trailer)ను కాసేపటి క్రితం విడుదల చేశారు. ఆర్.రవి కుమార్(Ravi kumar) దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్, కామెడీ జానర్‌లో తెరకెక్కగా అస్కార్ అవార్డు విన్నింగ్ సంగీత దర్శకుడు రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించారు.
వారం రోజుల క్రితమే రిలీజ్ చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి, ఈ క్రమంలో ఈ రోజు (శుక్రవారం)రాత్రి అయలాన్ (Ayalaan Trailer) తెలుగు ట్రైలర్‌ను శివకార్తికేయన్ తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా విడుదల చేశారు. ఇప్పుడు ఈ ట్రైలర్ కూడీ ఆద్యంతం ఆసక్తిగా ఉండి సినిమా కోసం ఎదురు చూసేలా చేస్తున్నది.ఈ భూమి అన్ని జీవరాశులకు సొంతం అని నాన్న చెప్పిన మాటలను నేను నమ్ముతాను అంటూ శివకార్తీకేయన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ అటు తర్వాత ఎలియన్ భూమి పైకి రావడంతో తన జీవితం పూర్తిగా మారిపోతుంది.
ఈ క్రమంలో ఎలియన్ వచ్చాక హీరో దాంతో కలిసి చేసే కామెడీ, సందడి, పోరాటాలు ఆద్యంతం అకట్టుకునేలా, ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నట్లు ట్రైలర్ (Ayalaan Trailer)లో చూయించారు. మామూలుగా ఎలియన్స్ ప్రతీ సారి అమెరికాను అంతం చేయడానికే కదా వెళ్తాయి.. ఇప్పుడు మా దేశానికి వచ్చారేంట్రా అంటూ శివకార్తికేయన్ (Siva Karthikeyan) చెప్పే ఫన్నీ డైలాగ్ ఆకట్టుకోవడమే కాక, దేశంలో విద్వంసం సృష్టించే ఫ్లాన్‌లో ఉన్న విలన్‌ను హీరో, ఏలియన్ తో కలిసి ఎలా ఎదుర్కొన్నాడనే యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగేలా చేస్తున్నది. ఈ చిత్రంలో ఎలియన్ పాత్రకు తమిళ్‌లో సిద్ధార్థ్ వాయిస్ అందిచడం విశేషం. మీరు ఇంకా ట్రైలర్ చూడలేదా ఇప్పుడే చేసేయండి మరి.