Siva Karthikeyan: సైనికుల కష్టంతో పోలిస్తే ఇదేం కష్టం కాదు

ABN, Publish Date - Sep 17 , 2024 | 06:34 PM

శివకార్తికేయన్‌ నటించిన తాజా చిత్రం ‘అమరన్‌’. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో బయోగ్రాఫికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది.

శివకార్తికేయన్‌ (Siva Karthikeyan)నటించిన తాజా చిత్రం ‘అమరన్‌’ (Amaran). రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో బయోగ్రాఫికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి హీరో కమల్‌హాసన్‌ నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ఈ సినిమా గురించి శివ కార్తికేయన్‌ మాట్లాడుతూ ుూసరిహద్దుల్లో మన సైనికులు పడుతున్న కష్టంతో పోలిస్తే, ‘అమరన్‌’ కోసం నేను పడిన శ్రమ చాలా తక్కువ. మొదట్లో ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర చేయడానికి చాలా కష్టంగా అనిపించింది. నేను కశ్మీర్‌ వెళ్లి మన సైనికులతో కలిసి మూడు రోజులు గడిపాను. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి పడుకునే వరకూ వాళ్లు నిర్వర్తించే బాధ్యతలేంటో చూశాను. ఆ కష్టం చూసిన తర్వాత సినిమా కోసం, నా పాత్ర కోసం నేను పడిన శ్రమ చాలా తక్కువ అనిపించింది’’ అని అన్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ అక్టోబరు 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో థియేట్రికల్‌ హక్కుల్ని శ్రేష్ఠ్‌ మూవీస్‌ సంస్థ దక్కించుకుంది. ‘ఇండియాస్‌ మోస్ట్‌’ అనే పుస్తకంలోని మేజర్‌ వరదరాజన్‌ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో శివ కార్తికేయన్‌ ఆర్మీ అధికారి మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ పాత్రలో కనిపించనున్నారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 

Updated Date - Sep 17 , 2024 | 06:35 PM