మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Siddharth-Aditi rao Hydari: నిశ్చితార్థం తర్వాత తొలిసారి.. జంటగా..

ABN, Publish Date - Apr 19 , 2024 | 02:55 PM

సిద్ధార్థ్‌, అదితీరావ్‌ హైదరీకి ఇటీవల నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే! కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇటీవల మహబూబ్‌నగర్‌, వనపర్తిలోని ఓ దేవాలయంలో కుటుంబ సభ్యులో మాత్రమే పాల్గొనగా నిశ్చితార్థం చేసుకున్నారు.

సిద్ధార్థ్‌(siddharth), అదితీరావ్‌ హైదరీకి (Adithirao Hydari) ఇటీవల నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే! కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇటీవల మహబూబ్‌నగర్‌, వనపర్తిలోని ఓ దేవాలయంలో కుటుంబ సభ్యులో మాత్రమే పాల్గొనగా నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు. నిశ్చితార్థం అనంతరం తొలిసారి ఈ జంట ఓ ఈవెంట్‌లో కనిపించారు. గురువారం చెన్నైలో జరిగిన సినిమా ప్రోగ్రాంలో సిద్దార్థ్‌, అదితీ కెమెరాకు చిక్కారు.  



సిద్దార్థ్‌కు గతంలో ఓ పెళ్లి అయింది. మనస్పర్థల కారణంగా ఆయన భార్యకు విడాకులు ఇచ్చారు. అదితీరావ్‌ హైదరీ కూడా అంతే. అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన 'మహా సముద్రం’ చిత్రం కోసం జతకట్టారు. ఆ సినిమా చిత్రీకరణలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరి మధ్య రీల్‌ లైఫ్‌లో వర్కవుట్‌ అయిన  కెమిస్ట్రీ  ఇప్పుడు రియల్‌ లైఫ్‌లో కూడా వర్కవుట్‌ కానుంది. మూడేళ్లగా ప్రేమలో ఉన్న ఈ జంట అప్పుడప్పుడు  బయట చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. అయితే పెళ్లి ఎప్పుడనేది ఇంకా వెల్లడించలేదు. 

Paarijatha Parvam Movie Review: ఇదేమి సినిమారా బాబోయ్!

Updated Date - Apr 19 , 2024 | 03:44 PM