మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shweta Menon: బికినీ కాదు.. అవసరం అయితే ఇంకో అడుగు ముందుకేస్తా! 

ABN, Publish Date - Feb 11 , 2024 | 03:53 PM

'రతి నిర్వేదం’ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు హాట్‌ బ్యూటీ శ్వేతా మీనన్‌. 2011లో మలయాళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! శ్రీజిత్‌ విజయ్‌ కథానాయకుడిగా టి.కె.రాజీవ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

'రతి నిర్వేదం’ (Rathi nirvedham) సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు హాట్‌ బ్యూటీ శ్వేతా మీనన్‌ (Swetha menon). 2011లో మలయాళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! శ్రీజిత్‌ విజయ్‌ కథానాయకుడిగా టి.కె.రాజీవ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యధార్థ సంఘటనలతో పి.పద్మరాజన్‌ రచించిన నవల ‘రతినిర్వేదం’ 1978లో సినిమాగా తెరకెక్కి సూపర్‌ హిట్‌ అయింది. అదే టైటిల్‌తో 2011లో ఆ సినిమాను శ్వేతామీనన్‌తో రీమేక్‌ చేశారు. 1991లో మలయాళ చిత్రంలో అడుగు పెట్టిన ఆమె గతంలో కొన్ని రొమాన్స్‌ సీన్స్‌తో బికినీలో కూడా దర్శనమిచ్చి కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. ఈ విషయంపై తాజాగా ఆమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. రతి నిర్వేదంలో చేసిన పాత్ర మళ్లీ చేయాల్సి వస్తే అంగీకరిస్తారా? అని ప్రశ్నించగా అందుకు ఆమె ధీటుగా సమాధానం ఇచ్చింది. 

‘నేను చేసే పాత్ర ఏంటో తెలుసుకున్నాకే ఆ సినిమాకు గ్రీన్  సిగ్నల్‌ ఇస్తా. అవును.. గతంలో కథ డిమాండ్‌ మేరకు బోల్డ్‌గా కనిపించా, శృంగార సన్నివేశాల్లో కనిపించా. బికినీ కూడా ధరించా. సినిమాకు అవసరం అనిపిస్తే బికినీ మాత్రమే కాదు మరొక అడుగు ముందుకేసి నగ్నంగా కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని బోల్డ్‌ స్టేటమెంట్‌ ఇచ్చింది. 50 ఏళ్ల వయసులో కూడా ఆమె ఈ తరహా పాత్రలు చేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - Feb 11 , 2024 | 03:59 PM