Shruthi Haasan: లోకేష్ అణకువగా ఉంటాడు.. ఇంతలా చేస్తాడనుకోలేదు
ABN, Publish Date - Mar 28 , 2024 | 03:53 PM
లోకేష్ కనకరాజ్ నాకు నటుడిగా కనిపిస్తారని, పెద్ద దర్శకుడైనా చాలా అణకువగా ఉండే వ్యక్తి అని ఈ అల్బమ్‌లో ఇంత ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదని శృతిహాసన్ తెలిపింది.
తనకు రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Flim International) పుట్టినిల్లు వంటిదని యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) అన్నారు. హీరోయిన్ శృతి హాసన్ (Shruthi Haasan)తో కలిసి ఆయన నటించిన ‘ఇనిమేల్’ (Inimel) ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్‌ను ఇలీవలే రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) సాహిత్యం అందించగా, శృతిహాసన్ (Shruthi Haasan) సంగీత స్వరాలు సమకూర్చారు. ఇందులో శృతిహాసన్, లోకేష్ కనకరాజ్ మధ్య సన్నిహిత సన్నివేశాలు ఉండటం ఆశ్చర్య పరిచింది. ‘యాక్షన్ డైరెక్టర్ రొమాన్స్ హీరో’గా మారిపోయారంటూ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో సాంగ్ విడుదల అనంతరం లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) విలేకరులతో మాట్లాడుతూ.. ‘కెమెరా ముందు నటించాలన్న కోరిక నాకు ఏమాత్రం కూడా లేదు. కానీ, ఈ ఆల్బమ్ సాంగ్‌లో నటించాలని శ్రుతి కోరడంతో ఆశ్చర్యపోయా. ఆ తర్వాత ఆల్బమ్ యూనిట్ సభ్యుల సహకారంతో సులభంగా నటించాను. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో నేను అధికంగా మాట్లాడిన వ్యక్తి కమల్ హాసన్ (Kamal Haasan) మాత్రమే. అందుకే ఆయన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Flim International) నాకు ఒక పుట్టినిల్లు వంటింది’ అన్నారు.
హీరోయిన్ శృతిహాసన్ (Shruthi Haasan) మాట్లాడుతూ..‘జీవితంలో గాఢంగా ప్రేమించిన ఒక వ్యక్తితో ఉన్న అనుబంధం, జీవితం, ప్రేమలో వైఫల్యం, వీటన్నింటినీ నాలుగు నిమిషాల వీడియో సాంగ్‌లో చెప్పాలనుకున్నా. ముందు ఈ సాంగ్‌ను నా పియానో మీద ఇంగ్లీష్‌లో రాసుకున్నా. ప్రస్తుత జనరేషన్ మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించా. నా ఉద్దేశంలో ప్రేమ ఒక మాయాలోకం. చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా షుగర్ క్యాండీలను ఇష్టంగా తింటాం. ప్రేమ కూడా అంతే.
లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) నటుడిగా కనిపిస్తారు. పెద్ద దర్శకుడైనా అణకువగా ఉండే వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. దర్శకత్వంలో తను ఎంత క్రియేటివ్‌గా ఉంటాడో తెలుసు. కానీ, ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదని శృతిహాసన్ (Shruthi Haasan) తెలిపింది. తొమ్మిది వేర్వేరు లొకేషన్లలో ఈ పాట చిత్రీకరించామని,. ఈ పాట కోసం నాన్న పది రకాల లిరిక్స్ ఇచ్చారని, నాన్నతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తా’ అన్నారు.